యశోద సినిమాకు మంచి బజ్ వచ్చింది. మంచి పబ్లిసిటీ చేసారు. మంచి విడుదల చేస్తున్నారు. అందులో ఎక్కడా సందేహం లేదు. ఇక ఓపెనింగ్ ఏ మేరకు వస్తుందన్నది చూడాలి తప్ప అంచనా వేసేది కాదు. రావచ్చు..రాకపోవచ్చు.
ఇదిలా వుంటే సినిమాకు వడ్డీలు, పబ్లిసిటీ అన్నీ కలిపి 40 కోట్లు అయిందని నిర్మాత కృష్ణ ప్రసాద్ ఓపెన్ గా చెప్పిన దగ్గర నుంచి సమంత వైపు ఆమె టీమ్ కిందా మీదా అయిపోతోంది. సినిమాకు గట్టిగా పాతిక కోట్లు కాలేదని, నిర్మాతకు ఏకంగా పది పదిహేను కోట్లు మిగిలిపోయాయని ప్రచారం చేయడానికి కిందా మీదా అవుతోంది.
శాటిటైల్ ఇంత వచ్చింది..హిందీ ఇంత… ఓవర్ సీస్ అంత అంటూ నానా బూతు లెక్కలు చూపిస్తోంది. నిజానికి ఈ టీమ్ కు తెలియంది ఏమిటంటే కర్ణాటక అమ్మలేదు..హాట్ స్టార్ వాళ్లు విడుదల చేస్తున్నారు. హిందీ అమ్మలేదు యుఎఫ్ఓ వాళ్లు విడుదల చేస్తున్నారు. తమిళనాడు ఓన్ రిలీజ్. కేవలం తెలుగు రాష్ట్రాలు మాత్రం 9 కోట్లకు విక్రయించారు. ఓవర్ సీస్ 1.50 కోట్లు. కానీ ఈ టీమ్ రెండున్నర కోట్లు అంటూ ప్రచారం సాగిస్తోంది. శాటిలైట్ ఇంత వరకు కాలేదు. హిందీ శాటిలైట్ కాలేదు
డిజిటల్ రైట్స్ 22 కోట్ల వరకు వచ్చింది. అంటే ఇప్పటికి రికవరీ అయింది. గట్టిగా 33 కోట్లు లేదు. కానీ సమంత టీమ్ మాత్రం 50 కోట్లు బిజినెస్ అయింది అంటూ టముకేయిస్తోంది. ఆ విధంగా నిర్మాత సేఫ్ అనే కలర్ ను పులమాలని చూస్తోంది. నిజానికి నిర్మాత ఎనిమిది కోట్ల డెఫిసిట్ లో విడుదల చేస్తున్నారు. సినిమాకు మంచి టాక్ వస్తే లాభాలు వుంటాయి. లేదంటే లేదు.