శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ ఇది. బ్రోచెవారెవరురా సక్సెస్ తో మంచి ఊపు మీదున్న ఈ హీరో, చాన్నాళ్లుగా పెండింగ్ లో పడిన తిప్పరా మీసం సినిమాను ఎట్టకేలకు బయటకు తీశాడు. దాదాపు ఏడాది కిందటే ఈ సినిమా పూర్తయింది. ఇప్పుడు దీనికి మోక్షం లభించింది. నిన్న ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ మొత్తం మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ చూపించారు. కానీ సినిమాలో మాత్రం ఓ సస్పెన్స్ ఎలిమెంట్ అలానే ఉంది. అదే మదర్ సెంటిమెంట్.
అవును.. తిప్పరా మీసం సినిమా మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కింది. కాకపోతే ఇన్నాళ్లూ మనం తెలుగు తెరపై చూసిన మదర్ సెంటిమెంట్ సినిమాల్లాంటిది కాదిది. హీరో క్యారెక్టరైజేషన్ కు, తల్లి పాత్రకు మధ్య మంచి క్లాష్ ఉంటుంది. ఎంతలా అంటే ఒక దశలో తల్లికొడుకుల మధ్య ప్రేమ ఉన్నప్పటికీ తిరిగి కలుసుకోలేనంత దూరం పెరిగిపోతుంది. అదే ఈ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ అంటున్నారు యూనిట్ సభ్యులు.
డిఫరెంట్ కథల్ని ఎంచుకోవడం శ్రీవిష్ణు స్టయిల్. రిజల్ట్ సంగతి తర్వాత. తిప్పరా మీసం సినిమాను కూడా అదే ఆలోచనతో సెలక్ట్ చేసుకున్నాడు. కాకపోతే ఆర్థిక కారణాల వల్ల ఇన్నాళ్లూ ఈ సినిమా లేట్ అయింది. బ్రోచేవారెవరురా సక్సెస్ తో ఈ సినిమాకు పట్టిన బూజు దులిపారు. కాస్త డబ్బులు పెట్టి రిలీజ్ ఫార్మాలిటీస్ పూర్తిచేస్తున్నారు. సినిమాలో శ్రీవిష్ణు తల్లిగా రోహిణి నటించగా, నిక్కీ తంబోలీ హీరోయిన్ గా నటించింది.