బాధ్యతలేని పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి అవసరమా?

ముందుగా పవన్ కళ్యాణ్ సినిమా నటుడు. ఆ తర్వాత రాజకీయనాయకుడు. సినిమా నటుల్ని చూసి అనుకరించే యువత ఎప్పుడూ ఉంటారు. అందుకే వాళ్లకి బాధ్యత అవసరం. ఇక రాజకీయనాయకులకి బాధ్యత మరింత అవసరం. ఎందుకంటే…

ముందుగా పవన్ కళ్యాణ్ సినిమా నటుడు. ఆ తర్వాత రాజకీయనాయకుడు. సినిమా నటుల్ని చూసి అనుకరించే యువత ఎప్పుడూ ఉంటారు. అందుకే వాళ్లకి బాధ్యత అవసరం. ఇక రాజకీయనాయకులకి బాధ్యత మరింత అవసరం. ఎందుకంటే వ్యవస్థల్ని నడిపేది వాళ్లే కనుక. నటుడిగా కానీ, రాజకీయ పార్టీ అధినేతగా కానీ అస్సలు బాధ్యత లేని వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నిలిచిపోతాడు. 

రాజకీయపార్టీ అధినేత హోదాలో వేదికలెక్కి “కొడకల్లారా” అంటూ స్పీచులిస్తాడు. తలకాయలేని వెర్రి అభిమానులు నలుగురు ఈలలేస్తే అవన్నీ ఓట్లుగా మారతాయనుకునే పిచ్చిమారాజులాగ మరింత రెచ్చిపోతాడు. 

మరో పక్క కారు టాపెక్కి కూర్చుని 60 కి పైగా స్పీడుతో హైవే మీద ప్రయాణం చేస్తాడు. సీటు బెల్టు పెట్టుకోబోతేనే ఫైన్లేసే వ్యవస్థ ఈ ప్రబుద్ధుడికి ఎంత ఫైన్ వెయ్యాలి? పొరపాటున ఏదో అడ్డొచ్చి డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసుంటే కీర్తిశేషుడైపోయేవాడు. అందుకే ఆయనగారి వింత చేష్టలకి అటు ఇటు ప్రాణాలకి తెగించి నిలబడిన బౌన్సర్లు అయ్యవారు గాలికి ఎగిరిపోకుండా పట్టుకు నిలబడ్డారు. 

ఈ మధ్యన విశాఖలో నోవోటెల్ హోటెల్ పైనుంచి సజెషన్లో ఫోటోలు, వీడియోలు వదిలిన పవన్ కి అవి పేలవంగా కొట్టినట్టున్నాయి. అందుకే ఈసారి ఈ హైవే విహారానికి కేజీఎఫ్ రేంజులో ఒక బ్యాక్గ్రౌండ్ కొట్టించుకుని వదిలాడు. ఇలాంటి అతిగాళ్లని చూసి జనం నవ్వుకుంటారు తప్ప ఓట్లేయరు. 

అయినా బాధ్యతారహితంగా ఉండడం కూడా ఒక బ్రాండింగ్ అనుకునే భ్రమలో బతుకుతున్నట్టున్నాడు. ఒకవేళ అదే నిజమైతే రాం గోపాల్ వర్మలాగ మిగిలిపోతాడు. తాను ఎంచుకున్న మార్గానికి సభ్యత, సంస్కారం, బాధ్యత, క్రమశిక్షణ అన్నీ అవసరం. కానీ ఇతనికి అవేవీ లేవు. 

వివాహబంధాల విషయంలో బాధ్యతలేదు. సినిమా నిర్మాతల పెట్టుబడుల విషయంలో బాధ్యత లేదు. ఎప్పుడు షూటింగ్స్ క్యాన్సిల్ చేస్తాడో తెలియదు. ఏ సెట్ కి ఎంతకాలం అద్దె కట్టాలో నిర్మాతకి తెలియదు. ఒప్పుకున్న సబ్జెక్ట్ అసలు చేస్తాడో లేదో దర్శకులకి తెలీదు. 

“హరిహర వీర మల్లు” షూటింగన్నాడు. మధ్యలో ఆపాడు. విదేశానికెళ్ళొచ్చాడు. సగం పైగా అయిపోయిన సినిమాకి వర్క్ షాప్ స్టిల్స్ అంటూ వదిలాడు. ఆ నిర్మాత దాదాపు ఆరిపోయే స్థితిలో ఉన్నాడు. పైగా ఆ నిర్మాత కాపే. సొంత సమాజికవర్గానికి చెందిన నిర్మాతకే ఊపిరాడనివ్వని ఈ కాపుతేజం ఇంకెవ్వరికి వెలుగందిస్తాడు? 

మరోపక్క సొంత మేనల్లుడు సాయిధరం తో ఒక సినిమాకి ఒప్పుకున్నాడు. కేవలం 20 రోజులకి అటు ఇటుగా పవన్ డేట్లు కేటాయిస్తే ఆ షూటింగ్ అయిపోతుంది. అది కూడా కేటాయించడు. భారీ అడ్వాన్సులు మాత్రం తీసేసుకున్నాడు. ఆ సినిమా తియ్యాల్సిన సముద్రఖని, వెయ్యాల్సిన సాయిధరం వేరే సినిమాలు చేసుకోకుండా కళ్లు వాచిపోయేలా ఇతగాడికోసం ఎదురు చూస్తున్నారు. నిర్మాతలేమో ఇచ్చిన అడ్వాన్సుకి వడ్డీలు కట్టుకుంటూ గుటకలు మింగుతున్నారు. 

ఇదా బాధ్యత? ఇదా సభ్యత? ఇదా క్రమశిక్షణ? లక్ష పుస్తకాలు చదివానంటాడు. నిజంగా చదివి జ్ఞానం పొందినవాడు ఇలా ప్రవర్తిస్తాడా? 

తన సినిమా కెరీర్ ని త్రివిక్రం చేతిలో పెట్టాడు. అతను ఇతని కెరీర్ ని తోలుబొమ్మలాగ ఆడించుకుని బతుకుతున్నాడు. తన రాజకీయ జీవితాన్ని నాదెండ్ల చేతిలో పెట్టాడు. అతను ఇతన్ని అడ్డుపెట్టుకుని పబ్బం గడుపుకుంటున్నాడు. ఈ ప్రోసెస్ లో అతనికి కావాల్సిందల్లా డబ్బుతప్ప మరేదే కాదు. 

ప్యాకేజీ స్టారంటే చెప్పుతీస్తానంటాడు కానీ, అతను సినిమాకైనా, రాజకీయానికైనా తన సమయాన్ని కాల్షీట్స్ లెక్కన అమ్ముకు బతుకుతున్నాడన్నది ఓపెన్ సీక్రెట్. 

తనని చంపడానికి 250కోట్లు సుపారీ రెడీ చేసారంటూ ఆరోపణలు చెసాడు. ఇంతకంటే హాస్యాస్పదం ఏదైనా ఉంటుందా? దాంట్లో సగమిస్తే తమ వైపుకే వచ్చేస్తాడు కదా అని మంత్రి అంబటి రాంబాబు అంటే ఆ బిట్టు వైరలయ్యింది. ఇలా కమెడీ పీసులాగ మిగిలిపోవడం తప్ప ఏమీ ఒరగట్లేదు. 

పవన్ కళ్యాణ్ రాజకీయ చిత్తశుద్ధికంటే కే ఏ పాల్ కమిట్మెంట్ నయమని, పవన్ స్పీచుల్లో లాజిక్కు కంటే నిత్యానంద ప్రసంగాలు నయం అని జనాలు అనుకునే స్టేజులో ఉన్నాడిప్పుడు పవన్ కళ్యాణ్. అతన్నే జనం ఇలా చూస్తుంటే ఇక అతన్ని ఫాలో అయ్యే వాళ్లని ఇంకెలా చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. పవన్ ని ఫాలో అవడం కంటే జీవితంలో రిగ్రెట్ అయ్యే అంశం మరొకటి ఉండదు. ఈ విషయం జనసైనికులకి కచ్చితంగా బోధపడుతుంది. 

హరగోపాల్ సూరపనేని