ఏపీ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత నారాయణ పరారీలో ఉన్నారా? ఇటీవలే పేపర్ లీకేజీ కేసుల్లో నారాయణ బెయిల్ ను రద్దు చేసింది చిత్తూరు కోర్టు. తాజాగా సీఆర్డీఏ అధికార దుర్వినియోగం వ్యవహారంలో నారాయణ బెయిల్ ను రద్దు చేసే హెచ్చరికను చేసింది సుప్రీం కోర్టు.
అధికార దుర్వినియోగానికి పాల్పడి సీఆర్డీఏ ప్లాన్లలో మార్పుచేర్పులు చేయించారు నారాయణ అనే అభియోగాలున్నాయి. వాటి విచారణకు సంబంధించి ఈ మాజీ మంత్రి సహకరించడం లేదని విచారణ సంస్థలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన సహకరించనట్టు అయితే బెయిల్ రద్దు పిటిషన్ తో తమవద్దకు రావాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
మరి ఇంతకీ నారాయణ ఎక్కడున్నారనేది మిస్టరీగా మారినట్టుంది. చిత్తూరు కోర్టులో బెయిల్ రద్దు తర్వాత నారాయణ పరారీలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. అరెస్టు భయంతో నారాయణ తప్పించుకు తిరుగుతున్నారు కాబోలు!
మరి చిత్తూరు కోర్టులోనే గాక, సుప్రీం కోర్టులో కూడా మరో కేసులో నారాయణ కే డైరెక్టుగా హెచ్చరికలు జారీ అయినట్టుగా ఉన్నాయి. చంద్రబాబు హయాంలో నామినేటెడ్ పదవితో మంత్రి పదవిని చేపట్టి.. రాజధాని వ్యవహారంలో అంతా తానై వ్యవహరించారు నారాయణ. అప్పట్లో అమరావతి విషయంలో ఆయన హడావుడి ఒక రేంజ్ లో ఉండేది. అమరావతి అంటే నారాయణ, నారాయణ అంటే అమరావతి అన్నట్టుగా హడావుడి జరిగేది. మరి ఇదే వ్యవహారంలో అధికార దుర్వినియోగం ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. విచారణకు సహకరించక వ్యవహారాన్ని కోర్టు వరకూ తీసుకెళ్తున్నట్టున్నారు.