వీడియో బయటకు రావడంపై హీరో ఫైర్‌

ఓ వీడియో బ‌య‌ట‌కు రావ‌డంపై హీరో నిఖిల్ ఫైర్ అయ్యారు. వ్య‌క్తిగ‌త ప్రైవ‌సీకి భంగం క‌లిగించేలా వీడియోను సోష‌ల్ మీడి యాలో వైర‌ల్ చేయ‌డంపై ఆయ‌న తీవ్ర‌స్థాయిలో అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. యంగ్ హీరో…

ఓ వీడియో బ‌య‌ట‌కు రావ‌డంపై హీరో నిఖిల్ ఫైర్ అయ్యారు. వ్య‌క్తిగ‌త ప్రైవ‌సీకి భంగం క‌లిగించేలా వీడియోను సోష‌ల్ మీడి యాలో వైర‌ల్ చేయ‌డంపై ఆయ‌న తీవ్ర‌స్థాయిలో అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. యంగ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం సాయిధ‌ర‌మ్ తేజ్ అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఉన్న తేజ్‌ను స్పృహ‌లోకి తీసుకొచ్చేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్న వీడియో బయటకు రావ‌డం తెలిసిందే. ఈ వీడియోలో… ‘కళ్లు తెరవండి, ఇటూ చూడండి’అంటూ డాక్టర్‌ భుజం తట్టి లేపడంతో తేజ్‌ కాస్తా చేయి కదిపాడు. 

ఈ వీడియో మీడియాలో, సోషల్‌ మీడియాల్లో వైరల్ అయ్యింది. ఈ వీడియో బ‌య‌ట‌కు రావ‌డంపై హీరో నిఖిల్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ట్విట‌ర్ వేదిక‌గా త‌న ఆగ్ర‌హాన్ని, అస‌హ‌నాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. 

‘ఐసీయూలో ఉన్నప్పుడైన వ్యక్తి ప్రైవసీకి గౌరవం ఇవ్వండి. అసలు ఐసీయూలోకి కెమెరాలను ఎందుకు అనుమతి ఇస్తున్నారు. సాయి తేజ్‌ ఐసీయూ వీడియో ఇలా బయటకు రావడం దారుణం’ అంటూ నిఖిల్‌ ఫైర్‌ అయ్యారు. నిఖిల్ ట్వీట్‌పై నెటిజ‌న్లు భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు.