ఇంటి పేరు కూన. కానీ తీరు మాత్రం జోరే. శ్రీకాకుళం జిల్లా టీడీపీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే అయిన కూన రవికుమార్ ఇపుడు చిక్కుల్లో పడబోతున్నారా అన్న చర్చ అయితే ఉంది. ఆయన స్పీకర్ తమ్మినేని సీతారామ్ మీద చేసిన విమర్శలకు ప్రివిలేజ్ కమిటీ వివరణ కోరింది.
అయితే ప్రతీ సారీ ఏదో సాకు చూపించి కూన కమిటీ ముందు హాజరు కావడంలేదని అంటున్నారు. దాంతో ఈసారి కూన విషయంలో ఉపేక్షించకూడదని యాక్షన్ కి దిగిపోవాల్సిందే అని కమిటీ అభిప్రాయపడినట్లుగా చెబుతున్నారు.
కూన కమిటీ ముందుకు వచ్చి తన వివరణ ఇవ్వాలని ఎన్ని సార్లు కోరినా ఆయన అందుబాటులో లేనని అబద్ధాలు చెబుతున్నారనడానికి ఆధారాలు ఉన్నాయని కమిటీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి కూన మీద యాక్షన్ కనుక తీసుకుంటే అది ఆయనకు బిగ్ షాక్ గానే చూడాలి.
ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారామ్ కి స్వయాన మేనల్లుడు అయిన కూన మామ మీద నోరు పారేసుకున్నందుకు గట్టి చర్యలే ఉంటాయని అంటున్నారు. మొత్తానికి కూనకి ఇది ఇబ్బందికరమైన పరిణామమే అని కూడా అంటున్నారు.