అతగాడో వారసత్వ హీరో .అందం వుంది కానీ అభినయం కాస్త సమస్య అని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం ఓ సినిమా షూట్ జరుగుతోంది.
షూటింగ్ లో హీరోగారి అభినయం ఆ డైరక్టర్ కు సంతృప్తినివ్వలేదని టాక్. దాంతో ఇక చాలు అని అప్పటికి ఆ షెడ్యూలు ఆపేసి, డైరక్టర్ గోవా వెళ్లిపోయాడట. అలా పోతూ పోతూ, అక్కడికి వస్తే కాస్త పర్సనల్ గా మాట్లాడాలి అని హీరోగారికి చెప్పేసి పోయాడని తెలుస్తోంది.
కొంపదీసి సదరు హీరోను మళ్లీ యాక్టింగ్ నేర్చుకుని రమ్మంటాడా? లేక ఎలా యాక్ట్ చేయాలో నేర్పిస్తాడా? అనే కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
అసలే ఆ హీరోను నమ్ముకుని 40 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్న సినిమా అది. పైగా అది హిట్ కొట్టకపోతే డైరక్టర్ కు కూడా సమస్య. ఎందుకంటే ఇప్పటికే ఆయన ఓ ఫ్లాపులో వున్నాడు.
మొత్తం మీద మళ్లీ షెడ్యూలు వేళకైనా హీరో బాగా నటిస్తే బాగుంటుందేమో? అన్నట్లు ఆ హీరోదే ఓ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. అందులో ఎలా నటించాడో చూస్తే అసలు సంగతి తెలుస్తుంది.