తెలంగాణ – భాజపా స్ట్రాటజీ వేరు

కొన్ని ఉపఎన్నికల్లో గెలిచారు..ఒకదాంట్లో ఓడారు. ఈసారి గెలిచామని తెరాస సంబరంగా వుంది. కానీ ఇక్కడ కాయిన్ కు మరో సైడ్ కూడా వుంది. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా వుంది. భాజపా కన్నా కాంగ్రెస్ నే…

కొన్ని ఉపఎన్నికల్లో గెలిచారు..ఒకదాంట్లో ఓడారు. ఈసారి గెలిచామని తెరాస సంబరంగా వుంది. కానీ ఇక్కడ కాయిన్ కు మరో సైడ్ కూడా వుంది. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా వుంది. భాజపా కన్నా కాంగ్రెస్ నే బలంగా వుంది అనే కొన్ని అంచనాలు ఇప్పటి వరకు వున్నాయి. ఒక్కో ఎన్నిక దాటుతున్న కొద్దీ కాంగ్రెస్ దిగ్విజయంగా మూడో స్థానానికి జారిపోతోంది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు పూర్తిగా జారిపోయింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో జరుగుతున్నపుడే మునుగోడు ఉపఎన్నిక జరగడం విశేషం. కానీ దాని ప్రభావం నాట్ నాట్ వన్ పర్సంట్ కూడా లేకపోయింది.

భాజపాకు కావాల్సింది ఇదే. గెలుపు ఓటములు కాదు. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి తెలంగాణలో తెరాస-భాజపాల నడుమ స్ట్రయిట్ ఫైట్ వుండాలి. ఆ ఫైట్ వచ్చే వరకు భాజపానే తెరాసకు సరైన అపోనెంట్ గా క్లియర్ గా కనిపించాలి. ఆ దిశగానే వ్యూహాలు రచించుకుంటూ వస్తోంది. లేకపోతే మునుగోడు ఎన్నికలకు అధికార పక్షంతో సహా ఇన్ని కోట్లు ఖర్చు చేయాల్సిన పని లేదు.

తెరాస..కమ్యూనిస్టులు, మజ్లిస్ పార్టీ ఓ వైపు…భాజపా మరో వైపు అన్నట్లు ఇప్పుడు పొలిటికల్ సీన్ చాలా క్లియర్ గా కనిపిస్తోంది. కాంగ్రెస్ దాదాపు ఆ తరువాత ప్లేస్ కు వెళ్లిపోయినట్లే. జరుగుతుందో, జరగదో కానీ ఎన్నికల లోపు మరో ఉపఎన్నిక వచ్చిందంటే ఇక కాంగ్రెస్ ను మరిచిపోయే పరిస్థితి రావచ్చు. మరోసారి తెరాస తన సర్వ శక్తులు కూడగట్టి భాజపాతో పోటీ పడాల్సి వుంటుంది.

తెరాసను భాజపా చెమటలు కక్కిస్తోంది అన్నది తెలంగాణ రాజకీయపటం మీద స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ను బూచిగా చూపిద్దామనే తెరాస ప్రయత్నాలు పోయాయి. భాజపాను దోషిగా చూపిద్దామన్న ప్రయత్నాలు సాగలేదు. అందువల్ల ఇప్పుడు తెరాస అంటే కిట్టని వారికి భాజపా బలమైన పక్షంగా కనిపిస్తోంది. ఎన్నికల వేళకు ఇది మరింత బలంగా మారేలాగే వుంది.

తెరాసకు మిగిలిన అండ ఒక్కటే మజ్లిస్. కాంగ్రెస్ వైపు వుండే మైనారిటీలు మజ్లిస్ కారణంగా తెరాస వైపు రావడంతో కాంగ్రెస్ మరింత నీరసపడుతోంది. భాజపా అంటే కిట్టని వామపక్షాలను కూడా తెరాస చేరదీసింది. ఈ రెండు అంశాలు తోడు పడకపోతే, ఈ పాటికే తెరాస బాగా నీరసపడిపోయేది. ఓ నియోజకవర్గంలో, ఇంత భారీ పోరులో పదివేల ఓట్ల మెజారిటీతో గెలవడం కాస్త విశేషమే. కానీ అన్ని ఎన్నికల్లోనూ ఇంతటి భారీ పోరు సాగించడం అసాధ్యం.

అలా అని ఈ ఏడాదిలో తప్పులు సరిదిద్దుకోవడం సాధ్యం అవుతుందా? అన్నది కూడా అనుమానమే. అలా అని భాజపాను ఏ విధంగానూ దోషిగా చూపించే పనులు ఈ ఏడాదిలో జరిగిపోవు. అందువల్ల ఇప్పుడు ఏ సీన్ వుందో అప్పుడూ అదే సీన్ వుంటుంది. కొత్త స్కీములు పెట్టి జనాలను ఆక్టుకుంటే తప్ప, సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి తెరాసకు కాస్త గడ్డు పరిస్థితే వుండేలా వుంది.