‘అలిపిరిలో’ అందమైన ప్రేమ పాట

కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై నూతన నటుడు రావణ్ నిట్టూరు కధానాయకుడిగా రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న చిత్రం 'అలిపిరికి అల్లంత దూరంలో'. డైరెక్టర్ నందిని రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా పని…

కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై నూతన నటుడు రావణ్ నిట్టూరు కధానాయకుడిగా రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న చిత్రం 'అలిపిరికి అల్లంత దూరంలో'. డైరెక్టర్ నందిని రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ఆనంద్ జె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యూనిక్ రాబరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్, అలాగే విడుదల చేసిన 'మా తిరుపతి' పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా చిత్రం నుండి విడుదలైన 'తెలుపనా' అనే ప్రేమ పాట కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. లీడ్ పెయిర్ మధ్య అందమైన కెమిస్ట్రీని ప్రెజంట్ చేస్తూ ఫణి కళ్యాణ్ క్యాచీ ట్యూన్ ని అందించారు. కిట్టూ విస్సాప్రగడ రాసిన లిరిక్స్ ప్రేమలోని మాధుర్యాని వ్యక్తపరిచాయి.

హైమత్ మహమ్మద్, అపర్ణ నందన్ పాడిన ఈ లవ్లీ మెలోడీ ఇప్పుడు యూట్యూబ్ తో పాటు ఆడియో స్ట్రీమింగ్‌ వేదికలన్నింటిలో వైరల్ గా వినిపిస్తోంది. మ్యూజిక్ లవర్స్ ని ఈ పాట విశేషంగా ఆకట్టుకుంటోంది.

నూతన నటీనటులతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి లహరి గుడివాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు.