రెండు వారాల గ్యాప్ లో అన్నదమ్ముల సినిమాలు!

సినిమాల మధ్య క్లాష్ అనేది సహజం. కానీ ఒకే కాంపౌండ్ హీరోల సినిమాల మధ్య మాత్రం ఎప్పుడూ క్లాష్ రాదు. రిలీజ్ డేట్స్ అలా సెట్ చేసుకుంటారు. కానీ అక్కినేని హీరోల సినిమాల మధ్య…

సినిమాల మధ్య క్లాష్ అనేది సహజం. కానీ ఒకే కాంపౌండ్ హీరోల సినిమాల మధ్య మాత్రం ఎప్పుడూ క్లాష్ రాదు. రిలీజ్ డేట్స్ అలా సెట్ చేసుకుంటారు. కానీ అక్కినేని హీరోల సినిమాల మధ్య మాత్రం కేవలం 2 వారాల గ్యాప్ మాత్రమే ఉంది. నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ, అఖిల్ చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు 2 వారాల వ్యవథిలో వస్తున్నాయి. 

లవ్ స్టోరీ సినిమాను ఈనెల 24న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈసారి డేట్ ఫిక్స్, వాయిదాల్లేవు. ట్రయిలర్ కూడా రిలీజైపోయింది. ఇది థియేటర్లలోకొచ్చిన 2 వారాలకే అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, అక్టోబర్ 8న రిలీజ్ అవుతోంది. ఇది కూడా థియేటర్లలోకే వస్తోంది.

ఒకవేళ నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా, ఫిదా టైపులో బ్లాక్ బస్టర్ అయితే మాత్రం, అఖిల్ సినిమాకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. తప్పనిసరి పరిస్థితుల మధ్య మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను వాయిదా వేయాల్సి ఉంటుంది. 

ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా ఎంత హిట్టయినా 2 వారాల తర్వాత నిలబడడం కష్టంగా ఉంది. ఈ లెక్కన చూసుకుంటే, అఖిల్ సినిమా చెప్పిన తేదీకే రావడం ఖాయం.

నిజానికి ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలివి. లవ్ స్టోరీ సినిమా ఏడాదిన్నరగా వాయిదా పడుతూ వస్తోంది. ఇక అఖిల్ సినిమాను సెకెండ్ వేవ్ దెబ్బకొట్టింది. అలా వాయిదాలు పడుతూ.. తప్పనిసరి పరిస్థితుల మధ్య 2 వారాల గ్యాప్ లో వస్తున్నాయి అక్కినేని అన్నదమ్ముల సినిమాలు. 

మధ్యలో రిపబ్లిక్ అనే సినిమా ఉన్నప్పటికీ, సాయితేజ్ కు యాక్సిడెంట్ అవ్వడంతో ఆ సినిమా వాయిదా పడుతుందనే అంచనాలున్నాయి.