ఎందరో అభిమానులు ఆలయాల్లో పూజలు చేయిస్తున్నారు. వారందరి అభిమానంతో హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం కుదటపడుతోంది. అపోలో డాక్టర్లు సదా కనిపెట్టుకుని వున్నారు.
మెగాస్టార్, ఆయన సోదరులు, కుటుంబ సభ్యులు సోమవారం రోజంతా అపోలో లోనే వున్నారు. వీరందరినీ ఒక్క విషయమే కలవర పెడుతోందని బోగట్టా. అయిదు రోజులుగా వెంటిలేటర్ వ్యవస్థ మీద వుండడం.
ఎక్కువ రోజులు ఈ వ్యవస్థ మీద వుంటే శరీరం మీద వేరే ప్రభావాలు చూపించే అవకాశం వుందని తెలుస్తోంది. అందుకే దాన్ని తీసేయాల్సి వుంది. దాని కోసం ఆల్టర్ నేటివ్ పద్దతలు ఏమిటి అనేది మెగా ఫ్యామిలీ అంతా డిస్కస్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
భీమ్లా నాయక్ షూటింగ్ లో వున్న పవన్ కూడా వీలు చూసుకుని అపోలోకి వెళ్లి ఈ డిస్కషన్ లో పాలు పంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు కానీ రేపు కానీ వెంటిలేటర్ తొలగించి, ఆలర్ట్ నేటివ్ ట్రీట్ మెంట్ అమలు చేస్తారని బోగట్టా.