కాజల్ త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతుందంట?

హీరోయిన్లకు ఎప్పుడూ ఉండే సమస్యలే ఇవి. బ్యాచిలర్ గా ఉన్నప్పుడు పెళ్లి పుకార్లు, పెళ్లి తర్వాత గర్భవతి అనే ఊహాగానాలు సర్వసాధారణం అయిపోయాయి. ఇప్పుడు హీరోయిన్ కాజల్ కూడా ఈ రూమర్లను ఎదుర్కొంటోంది. ఆమె…

హీరోయిన్లకు ఎప్పుడూ ఉండే సమస్యలే ఇవి. బ్యాచిలర్ గా ఉన్నప్పుడు పెళ్లి పుకార్లు, పెళ్లి తర్వాత గర్భవతి అనే ఊహాగానాలు సర్వసాధారణం అయిపోయాయి. ఇప్పుడు హీరోయిన్ కాజల్ కూడా ఈ రూమర్లను ఎదుర్కొంటోంది. ఆమె ప్రెగ్నెంట్ అనే పుకారు వినిపిస్తోంది.

ఫ్యామిలీ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును పెళ్లాడింది కాజల్. గతేడాది అక్టోబర్ లో వీళ్ల పెళ్లి జరిగింది. ఆ తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండా వెంటనే సినిమా సెట్స్ పైకి వచ్చేసింది కాజల్. ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. మధ్యలో భార్యాభర్త ఇద్దరూ హనీమూన్ కు కూడా వెళ్లొచ్చారు.

అలా ఏడాదిగా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న కాజల్, గర్భవతి అయిందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ అత్యుత్సాహం చూపించే బాలీవుడ్ మీడియా నుంచే ఈ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

ఆశ్చర్యంగా ఈ పుకార్లకు మరింత ఊతమిచ్చేలా కాజల్ సైలెంట్ అయింది. గడిచిన 2 వారాలుగా ఆమె సోషల్ మీడియాలో కనిపించడం లేదు. ప్రతి రోజూ ఏదో ఒక అప్ డేట్, ఓ కొత్త ఫొటోతో ట్విట్టర్/ఇనస్టాగ్రామ్ లో కనిపించే ఈ బ్యూటీ.. 2 వారాలుగా సైలెంట్ అవ్వడంతో, ఆమె గర్భవతి అనే పుకార్లు మరింత  ఊపందుకున్నాయి.