ఆ మధ్య షేర్ షా సినిమాతో ఆ డైరక్టర్ పేరు చాలా పాపులర్ లోకి వచ్చేసింది. దాంతో తెలుగు సినిమా నిర్మాతలు ఆ డైరక్టర్ వైపు చూస్తున్నారు.
నిజానికి ఆ డైరక్టర్ గతంలో తెలుగులో ఓ భారీ డిజాస్టర్ మూవీ ఇచ్చాడని మరిచిపోయారు. అతగాడు ఎవరో కాదు. విష్ణువర్ధన్. . అలా అంటే వెంటనే స్ట్రయిక్ కాకపోవచ్చు కానీ పంజా సినిమా అంటే చాలు గుర్తుకు వస్తుంది.
పవన్ కళ్యాణ్ తో పంజా అనే భారీ ప్లాపు సినిమా తీసింది ఇతగాడే. లేటెస్ట్ గా బాలీవుడ్ లో షేర్ షా అనే హిట్ కొట్టేసరికి తెలుగు నిర్మాతలు అటు చూస్తున్నారు. ప్రస్తుతానికి హీరో లాక్ అయ్యాడు. ఉప్పెనతో దూసుకువచ్చిన మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ తో సినిమా ఫిక్స్ అయింది.
అయితే నిర్మాత ఎవరు అన్న దగ్గర ఇంకా డిస్కషన్ నడుస్తోంది. విష్ణువర్ధన్ దగ్గర పాత అడ్వాన్స్ ఒకటి వుంది. వైష్ణవ్ తేజ్ డేట్ లు వేరే నిర్మాత దగ్గర వున్నాయి. అందువల్ల ఎవరు నిర్మాత అవుతారు అన్నది పక్కన పెడితే మరో తెలుగు సినిమా అయితే విష్ణు కు ఫిక్స్ అయినట్లే.