అమరావతికి అరడజనుకు పైగా విదేశాల నుంచి మద్దతు గళం వినిపించిందని పచ్చ మీడియా చెబుతూ ఉంది. ఎలాగూ అంతర్జాతీయంగా ఏ దేశంలో ఇప్పుడు అంత తేలికగా రోడ్డెక్కడానికి లేదు. ఎవరికి వారు ఇంట్లో నల్ల షర్టు వేసుకుని చేతులో ఏ క్యాండిలో పట్టుకుని సోషల్ మీడియాలో పెడితే పని అయిపోయినట్టే! అమరావతికి మద్దతు ప్రకటించినట్టే. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, న్యూజిలాండ్ వంటి దేశాల నుంచి అమరావతికి మద్దతు లభించిందని పచ్చమీడియా కథనాలను వండి వారుస్తూ ఉంది!
ఆ కులం వారు దాదాపుగా ప్రతి దేశానికీ వలస వెళ్లి ఉండొచ్చు. ఎక్కడ ఉన్నా కులాభిమానం వారిని వీడకపోవచ్చు. ఎలాగూ తమ కుల రాజధానిలో భూములపై పెట్టుబడులు పెట్టిన వారూ ఉండనే ఉంటారు. కాబట్టి..పెట్టుబడిదారులు నిరసన తెలపడంలో వింత ఏమీ లేకపోవచ్చు!
ఎటొచ్చీ.. అమరావతికి ఇలా ప్రపంచ దేశాల నుంచి వాళ్లంతా మద్దతు ప్రకటించినప్పటికీ, ఏపీ నుంచి మాత్రం అమరావతే కావాలనే కోరిక పచ్చ చొక్కాల వేసుకోని వారి నుంచి వినిపించకపోవడం గమనార్హం. ఆఖరికి రాయలసీమ, ఉత్తరాంధ్రలోని పచ్చ చొక్కాలు కూడా ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడటం లేదు. చంద్రబాబు నాయుడు దగ్గరుండి ద్విశతదినోత్సవం నిర్వహించినప్పటికీ.. పచ్చ పార్టీ వాళ్లు కూడా అమరావతే కావాలంటూ కనీసం ఇళ్ల నుంచి అరవలేదు! ఏంటో పాపం.. విదేశాల నుంచి వస్తున్న డిమాండ్, సొంత రాష్ట్రంలోనే లేదు!