Advertisement

Advertisement


Home > Politics - Gossip

టీవీ 5 చేతులు మారుతుందా?

టీవీ 5 చేతులు మారుతుందా?

పాపులర్ టీవీ ఛానెల్ టీవీ 5 యాజమాన్యం చేతులు మారుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఛానెల్ యాజమాన్యం అమ్మకపు చర్చలు సాగిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఓ దుబాయ్ సంస్ధ తో డీల్ డిస్కషన్లు సాగుతున్నాయని తెలుస్తోంది.

అంతకు ముందు కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో రియల్ ఎస్టెట్, ఫార్మా తదితర రంగాల్లో వేల కోట్ల టర్నోవర్ వున్న ఓ సంస్థ డీల్ డిస్కషన్ కు వెళ్లింది.  కానీ బేరం తెగలేదు. 

ఇప్పుడు మరో ఫర్మ్ రంగంలోకి దిగిందని తెలుస్తోంది. ఈసారి డీల్ దాదాపు ఫైనల్ స్టేజ్ కు వచ్చినట్లు తెలుస్తోంది. టీవీ 5 కు జూబ్లీ హిల్స్ లో కోట్లకు కోట్లు విలువ చేసే మాంచి భవంతి వుంది. కానీ డీల్ లో ఆ భవంతిని చేర్చడం లేదు.

కేవలం ఛానెల్ లైసెన్స్, మెటీరియల్ ఇతరత్రా మాత్రమే చేరుస్తున్నారని బోగట్టా. ఒకవేళ ఛానెల్ అక్కడే కొనసాగాలి అంటే ఆ భవంతికి అద్దె చెల్లించాల్సి వుంటుంది.

మొదట రంగంలోకి దిగిన సంస్థ తో బేరం చాలా తృటిలో తప్పిపోయిందని, దాని వెనుక రాజకీయ కారణాలు కూడా వున్నాయని తెలుస్తోంది. ఇప్పుడు మాత్రం డీల్ ఆల్ మోస్ట్ ఫైనల్ అని తెలుస్తోంది. 

టీవీ 5 చాలా తక్కువ కాలంలో పాపులర్ అయింది. ఆంధ్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా నిల్చున్న చానెళ్లలో టీవీ 5 ముందు వరుసలో వుంది.

రఘురామకృష్ణంరాజు దిగజారిపోయాడు

ఇక నుంచి నో లంచం నో దళారీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?