ఎన్నాకెన్నాళ్లకెన్నాకు..మణి-కమల్

మణిరత్నం పేరు గుర్తు వచ్చినా, కమల్ సినిమాల ప్రస్తావన వచ్చినా ‘నాయకుడు’ సినిమా గుర్తుకు రాకుండా వుండదు. మళ్లీ దశాబ్దాల కాలం తరువాత వీరిద్దరి కాంబినేషన్ సినిమా ఫిక్స్ అయింది. అనౌన్స్ మెంట్ వచ్చేసింది. …

మణిరత్నం పేరు గుర్తు వచ్చినా, కమల్ సినిమాల ప్రస్తావన వచ్చినా ‘నాయకుడు’ సినిమా గుర్తుకు రాకుండా వుండదు. మళ్లీ దశాబ్దాల కాలం తరువాత వీరిద్దరి కాంబినేషన్ సినిమా ఫిక్స్ అయింది. అనౌన్స్ మెంట్ వచ్చేసింది. 

కమల్ హోమ్ బ్యానర్..అలాగే మణిరత్నం స్వంత బ్యానర్ల మీద ఈ సినిమా నిర్మిస్తారు. అంతే కాదు, ఇప్పుడు తమిళనాడు సినిమా ఇండస్ట్రీలో భారీ సినిమాల తెరవెనుక కింగ్ పర్సన్ గా వున్న ఉదయానిధి స్టాలిన్ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా వుంటారు.

ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తారు. కమల్ హాసన్, మణిరత్నంల కలయిక వచ్చిన నాయకుడు దేశ సినిమా లైబ్రరీలో ఓ రిఫరెన్స్ ఫిల్మ్ గా నిలిచింది. దాదాపు 35 సంవత్సరాల తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది. 

ఈ సినిమా గురించి కమల్ హసన్ మాట్లాడుతూ..“35 సంవత్సరాల క్రితం మణిరత్నంతో పని చేసినపుడు ఎంత ఉత్సాహంగా వున్నానో ఇప్పుడు అంతే ఉత్సాహంగా వుంది. ఒకేరకమైన మనస్తత్వంతోవున్న వారితో కలసి పని చేయడం గొప్ప ఉత్తేజాన్నిస్తుంది. ఈ ఉత్సాహంలో రెహమాన్ కూడా తోడయ్యారు. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అన్నారు.