అఫీషియల్.. జూన్ కు షిఫ్ట్ అయిన ఆదిపురుష్

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుందనే విషయం పాతదే. కాకపోతే ఇప్పుడా విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, కొత్త విడుదల తేదీని కూడా ప్రకటించారు. Advertisement సంక్రాంతికి విడుదల…

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుందనే విషయం పాతదే. కాకపోతే ఇప్పుడా విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, కొత్త విడుదల తేదీని కూడా ప్రకటించారు.

సంక్రాంతికి విడుదల కావాల్సిన ఆదిపురుష్ సినిమాను వచ్చే ఏడాది జూన్ 16కు వాయిదా వేస్తున్నట్టు యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు దర్శకుడు ఓం రౌత్ అధికారిక ప్రకటన చేశాడు.

“ఆదిపురుష్ కేవలం సినిమా కాదు. దేవుడు శ్రీరాముడికి ప్రతిరూపం. మన చరిత్ర, సంస్కృతికి ప్రతిబింబం. అందుకే ప్రేక్షకులకు పూర్తి విజువల్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు, టీమ్ కు మరింత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆదిపురుష్ సినిమాను వచ్చే ఏడాది జూన్ 16న విడుదల చేస్తాం.”

ఇలా ఆదిపురుష్ సినిమాకు సంబంధించి కొత్త విడుదల తేదీని ప్రకటించాడు దర్శకుడు. ఈ మూవీ టీజర్ పై తీవ్ర విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. హనుమంతుడు, మరికొన్ని పాత్రల్ని లెదరు దుస్తుల్లో చూపించడం, రావణాసురుడికి విచిత్ర వాహనాన్ని ఇవ్వడం లాంటి అంశాలపై విమర్శలు చెలరేగాయి.

దీంతో ఆదిపురుష్ గ్రాఫిక్స్ ను పూర్తిస్థాయిలో మళ్లీ మార్చబోతున్నారు. దీనికోసం మరింత బడ్జెట్ ను కేటాయించారు. ఈ క్రమంలో విడుదల తేదీని కూడా మార్చారు.