గ్యాంగ్ లీడర్..అందరికీ ఆసిడ్ టెస్ట్

భలే భలే మగాడివోయ్ సినిమాకు ముందు హీరో నానికి ఫ్లాపుల పరంపర పలకరించింది. అలాంటి టైమ్ లో మారుతి డైరక్షన్ లో భలే భలే మగాడివోయ్ సినిమాతో కెరీర్ కు టర్నింగ్ ఇచ్చుకున్నాడు. అక్కడి…

భలే భలే మగాడివోయ్ సినిమాకు ముందు హీరో నానికి ఫ్లాపుల పరంపర పలకరించింది. అలాంటి టైమ్ లో మారుతి డైరక్షన్ లో భలే భలే మగాడివోయ్ సినిమాతో కెరీర్ కు టర్నింగ్ ఇచ్చుకున్నాడు. అక్కడి నుంచి సక్సెస్ లు స్టార్ట్ అయ్యాయి. కానీ మళ్లీ ఈ మధ్య ఫ్లాపులు పలకరించడం ప్రారంభమైంది. కృష్ణార్జున యుద్దం, దేవదాస్ పక్కా ఫ్లాపులుగా నిలిచాయి. జెర్సీ సినిమాకు క్రిటికల్ అప్రిసియేషన్ వచ్చింది కానీ, బయ్యర్లకు లాస్ తప్పలేదు. దాంతో నిర్మాతలు గుట్టుచప్పుడు కాకుండా బయ్యర్లకు డబ్బులు సర్దుబాటు చేసారు. 

లేటెస్ట్ గా గ్యాంగ్ లీడర్ వస్తోంది. ఈ సినిమా కాకుండా ఇంద్రగంటి డైరక్షన్ లో సైకో కిల్లర్ గా 'వి' సినిమాను నాని చేస్తున్నాడు. ఆ సినిమా తరువాత కొత్త ప్రాజెక్టులు డిస్కషన్ లో వున్నాయి. వాటిల్లో శివనిర్వాణ ప్రాజెక్టు ఒకటి. అయితే ఇది ఇంకా ఫైనల్ కావాల్సి వుంది. అందువల్ల నానికి గ్యాంగ్ లీడర్ సినిమా ఓ విధంగా ఆసిడ్ టెస్ట్ అనుకోవాలి. ఇది హిట్ అయితేనే, నాని సినిమాల ఓపెనింగ్స్ బాగుండే అవకాశం వుంది. లేదూ కష్టం అవుతుంది.

ఇక మైత్రీ మూవీస్ కు కూడా గ్యాంగ్ లీడర్ సినిమా ఆసిడ్ టెస్ట్ నే. సవ్యసాచి, డియర్ కామ్రేడ్ సినిమాలకు బయ్యర్లకు డబ్బులు వెనక్కు ఇవ్వాల్సి వచ్చింది. అందువల్ల గ్యాంగ్ లీడర్ సినిమా మార్కెటింగ్ కు సమస్య రాలేదు. కానీ ఈ సినిమా హిట్ అయితేనే మైత్రీకి బాగుంటుంది. లేదూ అంటే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. వెనుక వున్నది ప్రస్తుతానికి ఉప్పెన సినిమా ఒక్కటే. బన్నీ-సుకుమార్ సినిమా స్టార్ట్ కావాల్సి వుంది. వరుస పరాజయాల బ్యాడ్ నేమ్ నుంచి తప్పించుకుని, మైత్రీ మళ్లీ ట్రాక్ మీదకు రావాలంటే గ్యాంగ్ లీడర్ హిట్ కొట్టి తీరాలి. 

డైరక్టర్ విక్రమ్ కే కుమార్ కు ఈ సినిమా పరీక్షనే. మనం సినిమా తరువాత కమర్షియల్ సక్సెస్ లేదు విక్రమ్ కుమార్ కు. మంచి డైరక్టర్ అన్న ట్యాగ్ లైన్ వున్నా, కమర్షియల్ సక్సెస్ లేకుంటే వరుస ఫెయిల్యూర్ల తరువాత మరో సినిమా రావడం కష్టం అవుతుంది. అలా కాకుండా వుండాలి అంటే గ్యాంగ్ లీడర్ హిట్ కొట్టి తీరాలి.

ఇలా, హీరోకి, దర్శకుడికి, నిర్మాతలకు అంతా మంచి జరగాలంటే గ్యాంగ్ లీడర్ హిట్ కొట్టి తీరాల్సిందే.