నిర్మాత బాధ వేరు..సమంత బాధ వేరు

ఇద్దరిదీ తప్పు కాదు. అసలు విషయం క్లారిటీగా చెప్పకుండా ట్వీట్ లు వేయడం..లేదా ట్రోల్ చేయడం వల్ల వచ్చే సమస్య ఇది. సినిమాకు ఇంత ఖర్చు అయిందని నిర్మాతలు చెప్పడం మామూలే. దాంటో ఓ…

ఇద్దరిదీ తప్పు కాదు. అసలు విషయం క్లారిటీగా చెప్పకుండా ట్వీట్ లు వేయడం..లేదా ట్రోల్ చేయడం వల్ల వచ్చే సమస్య ఇది. సినిమాకు ఇంత ఖర్చు అయిందని నిర్మాతలు చెప్పడం మామూలే. దాంటో ఓ పదిశాతం అందనంగా వుండడం అన్నదీ మామూలే. ఇది నిర్మాత బాధ. తీరా సినిమా విడుదల అయిన తరవాత ఆ మేరకు వసూళ్లు రాకపోతే, సదరు సినిమా హీరో లేదా హీరోయిన్ ను ట్రోల్ చేయడం ఇంకా మామూలే. అందుకే అయిన ఖర్చు కన్నా ఓ పదిశాతం తక్కువ చెప్పడం హీరోలకు లేదా హీరోయిన్లకు అలవాటు.

యశోద విషయంలో ఇదే తకరారు. ఈ సినిమా కథ చిన్న రేంజ్ లో తనకు వచ్చిందని, కానీ తాను దాని లెవెల్ గుర్తించి భారీగా నిర్మించానన్నది నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ భావం. మూడు కోట్లలో తీయాలనుకున్న కథ తన దగ్గరకు వస్తే దాన్ని నలభై కోట్ల రేంజ్ లో భారీగా తీసానని ఆయన చెప్పారు.

కానీ దీన్ని పట్టుకుని యాంటీ సమంత బ్యాచ్ ట్రోలింగ్ కు దిగిపోయింది. సమంత సినిమాకు 40 కోట్లు ఏమిటి? పిచ్చా? వెర్రా? అంటూ. కానీ ఇదే బ్యాచ్ గతంలో అనుష్క భాగమతి సినిమాకు 30 కోట్ల మేరకు ఖర్చు చేసిన యువి సంగతి మరిచిపోయింది. నిశ్శబ్ధం సినిమాకు 30 కోట్లు ఖర్చయిన సంగతి విస్మరించింది.

ఈ ట్రోలింగ్ చూసి, అసలే అనారోగ్యంతో వున్న సమంత ఫీలవుతున్నట్లు బోగట్టా. అసలు అంత ఖర్చు ఎక్కడ అయింది అని ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

నిజానికి ఇక్కడ ఎవరిదీ తప్పు లేదు. సినిమాకు 30 కోట్లకు కాస్త అటు ఇటుగా ఖర్చయింది. పబ్లిసిటీ ఇతరత్రా ఖర్చులు మరికొంత. కానీ ఇది కాదు అసలు సమస్య. నిర్మాత కట్టుకున్న వడ్డీలు. సినిమా దాదాపు పూర్తయిన తరువాత ఈ వడ్డీలు నెలకు 95 లక్షల వరకు చేరాయి. అది ఆయన సమస్య. స్వంత డబ్బులు లేక అప్పులు తెచ్చుకున్నపుడు వడ్డీలు కట్టాలి కదా. అవన్నీ కలిపి నలభై అయ్యాయన్నది నిర్మాత భావం. సమంత సినిమాకు ఏకంగా నలభై అయిందంట అన్నది వార్తలు, ట్వీట్ ల భావం.

అయితే సినిమా డిజిటల్, ఓవర్ సీస్, తెలుగు రాష్ట్రాలు అమ్మడం ద్వారా 32 కోట్ల వరకు రికవరీ వచ్చేసింది. ఇంకా శాటిటైల్ వుండనే వుంది. అది కాక హిందీ, కన్నడ ఓన్ రిలీజ్ వుండనే వుంది. సినిమా హిట్ అనిపించుకుంటే లాభాలు లేదు అనుకున్నా అక్కడిక్కడ సరిపోతుంది.