జగన్ కంటే ఆస్థికుడు ఎవరు…?

ఆస్థికత్వం అంటే ఉన్నది ఉంది గట్టిగా అని నమ్మడం. ఉన్న దాన్ని పరిరక్షించడం. ఆ విధంగా చూస్తే జగన్ కంటే ఆస్థికుడు ఎవరు అని వైసీపీ నేతలు అంటున్నారు. ఉత్తరాంధ్రాలోనే కాదు ఏపీలోనే అతి…

ఆస్థికత్వం అంటే ఉన్నది ఉంది గట్టిగా అని నమ్మడం. ఉన్న దాన్ని పరిరక్షించడం. ఆ విధంగా చూస్తే జగన్ కంటే ఆస్థికుడు ఎవరు అని వైసీపీ నేతలు అంటున్నారు. ఉత్తరాంధ్రాలోనే కాదు ఏపీలోనే అతి పెద్ద నారసింహ క్షేత్రంగా ఉన్న శ్రీ సింహాచలం వరహా లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ చుట్టూరా అతి పెద్ద రక్షణ గోడను వైసీపీ సర్కార్ నిర్మిస్తోంది. దీంతో అప్పన్న భూములను అప్పనంగా కబ్జా చేయాలకునేవారికి చెక్ పెడ్డట్లే అంటున్నారు.

ఈ ఆలోచన విశాఖలో పాదయాత్ర సమయంలో జగన్ కి కలిగింది. అప్పట్లో చాలా మంది సింహాచలం అప్పన్న భూములు భూదందాలకు గురి అవుతున్నయని ఆయన దృష్టిలోకి తెచ్చారు. వాటిని పరిరక్షించడానికి ప్రహారీ గోడని నిర్మిస్తే బాగుంటుంది అని సూచించారు. వెంటనే జగన్ హామీ ఇచ్చేశారు. తాను అధికారంలోకి వస్తే ఆ పని పూర్తి చేస్తాను అని.

దానికి అనుగుణంగానే ఇపుడు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంది. దీనికి తాజాగా స్వరూపానందేంద్ర స్వామి శంకుస్థాపన చేశారు. జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఆక్రమణలకు శాశ్వతంగా అడ్డుతెర పడుతుందని ఆయన పేర్కొన్నారు.

ఆస్థికులు అంటే భక్తిని ఆశ్రయించేవారు, దేవుడు ఉన్నారని నమ్మేవారు. ఆ విధంగా చూస్తే ఆ దేవుడికి అవసరం అయిన కార్యక్రమాలు చేస్తూ ఆయన ఆస్తులను కాపాడుతున్న జగన్ కంటే పెద్ద ఆస్థికుడు ఎవరుంటారు అన్న ప్రశ్నకు ఆయన్ని నిత్యం విమర్శించే విపక్షాల నుంచి జవాబు ఉందా.