కరోనా టైమ్ లో 10 కోట్ల అప్పు

కరోనా టైమ్ లో సినిమా నిర్మాతలంతా చేతులు ముడుచుకుని కూర్చున్నారు. సినిమా రంగ భవిష్యత్ ఎలా వుంటుందో తెలియని స్థితి వుంది. కానీ ఓ బడా నిర్మాత వ్యవహారం వేరుగా వుంది. ఓ సూపర్…

కరోనా టైమ్ లో సినిమా నిర్మాతలంతా చేతులు ముడుచుకుని కూర్చున్నారు. సినిమా రంగ భవిష్యత్ ఎలా వుంటుందో తెలియని స్థితి వుంది. కానీ ఓ బడా నిర్మాత వ్యవహారం వేరుగా వుంది. ఓ సూపర్ స్టార్ తరువాత సినిమా తనదే అని, అందుకోసం అడ్వాన్స్ అర్జెంట్ ఇవ్వాలని 10 కోట్ల అప్పు చేసాడట.

ఎవరా సూపర్ స్టార్, ఏమా సినిమా, ఎవరా డైరక్టర్ అన్నది పక్కాగా అన్నీ రూఢీ చేసుకున్నాకే పది కోట్ల అప్పు నగదు రూపంలో చేతులు మారినట్లు తెలుస్తోంది. గతంలో చిన్న పెద్ద సినిమాలు ఎన్నో తీసిన ఆ నిర్మాత, సదరు సూపర్ స్టార్ తో కూడా సినిమాలు తీసారు. మళ్లీ మరోసారి సినిమా చేసుకునే అవకాశాన్ని ఆ హీరో ఇచ్చినట్లు టాక్ వుంది.

మరి ఆ హీరోకి అడ్వాన్స్ గా ఈ పది కోట్లు కరోనా టైమ్ లో అందాయా? లేక అడ్వాన్స్ కు, కరోనా టైమ్ లో ఖర్చుల అడ్జస్ట్ మెంట్లకు పనికి వస్తాయనా, లేదా తీయబోయే ఓ మీడియం సినిమాకు కూడా పెట్టుబడిగా పనికి వస్తాయనా? మొత్తం మీద ఏదో అవసరంతో మరేదో ధైర్యంతో ఈ పదికోట్ల అప్పు చేసారు ఆ పెద్ద నిర్మాత అనుకోవాలి.

రఘురామకృష్ణంరాజు దిగజారిపోయాడు

ఇక నుంచి నో లంచం నో దళారీ