గ్రేటర్ ఎన్నికలు పార్టీలకు లిట్మస్ టెస్ట్

త్వరలో రానున్న గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు తెలంగాణలో అధికారంలో ఉన్న, అధికారంలోకి రావాలని ఆశిస్తున్న పార్టీలకు లిట్మస్ టెస్ట్ లాంటివని విశ్లేషకులు భావిస్తున్నారు. 150  కార్పొరేటర్ సీట్లు ఉన్న కార్పొరేషన్లో ప్రస్తుతం తెలంగాణ…

త్వరలో రానున్న గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు తెలంగాణలో అధికారంలో ఉన్న, అధికారంలోకి రావాలని ఆశిస్తున్న పార్టీలకు లిట్మస్ టెస్ట్ లాంటివని విశ్లేషకులు భావిస్తున్నారు. 150  కార్పొరేటర్ సీట్లు ఉన్న కార్పొరేషన్లో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి 99 స్థానాలను గెలుచుకొని గద్దెపై ఉంది.  గ్రేటర్లో  తమ హవా చూపిస్తామని  భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దూకుడును కనబరుస్తోంది.  అసెంబ్లీ ఎన్నికలలో  వైఫల్యాలను నిరూపించుకోవాలని కాంగ్రెస్ పడుతోంది.  ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికలు అన్ని పార్టీలకు లిట్మస్ టెస్ట్   కాగలవనడంలో సందేహం లేదు.

గత గ్రేటర్ ఎన్నికల్లో తెరాస ఈ స్థాయిలో విజయదుందుభి మోగిస్తుందని ఎవరూ ఊహించలేదు. కేసీఆర్, కేటీఆర్ మాత్రం తొలినుంచి 100 సీట్లు గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. ఎవరూ నమ్మలేదు. 99 స్థానాలు గెలిచారు. మజ్లిస్ 44 గెలిస్తే, భాజపా 4, కాంగ్రెస్ 2, తెదేపా 1 గెలిచాయి. ఆ తర్వాత తెరాస బలం ఇంకా పెరిగిందనే అనుకోవాలి. శాసనసభ ఎన్నికలను వారు స్వీప్ చేశారు. పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి మాత్రం గ్రాఫ్ పడిపోయింది. కేవలం 8స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్, భాజపా చెరి నాలుగు స్థానాలు దక్కించుకున్నాయి. మొత్తానికి, అసెంబ్లీ ఎన్నికల నాటినుంచి తిరిగి బలాన్ని పుంజుకున్నట్లుగా భావించాలి.

ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు వస్తున్న తరుణంలో.. ఈ పార్టీలన్నీ తమ బలాల్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తాయి. గ్రేటర్ మెజారిటీ సీట్లు సాధిస్తే.. కేసీఆర్ సర్కారుకు ప్రభ తగ్గుతోందని చెప్పడం విపక్షాలకు కుదురుతుంది. భాజపా సికింద్రాబాద్ ఎంపీ స్థానం కూడా గెలిచిన నేపథ్యంలో వారి మీద మరింత ఒత్తిడి ఉంటుంది. పైగా తెరాసకు ప్రత్యామ్నాయం అయ్యేలా, అసెంబ్లీ గద్దె ఎక్కేలా బలపడాలని అనుకుంటున్న భాజపాకు ఈ ఎన్నికలు పెద్ద పరీక్ష.

గతంలో సాధించిన 4 సీట్లను ఎంతవరకు పెంచుకోవచ్చో వారు నిరూపించుకోవాలి. కాంగ్రెస్ కు దక్కిన 2 స్థానాలనుంచి ఈసారి ఏమవుతుందో చూడాలి. తెలుగుదేశం సంగతి సరే సరి. అప్పట్లో 1 సీటు దక్కింది. ఇప్పుడు చంద్రబాబు పెడుతున్న ఎక్స్ ట్రా ఫోకస్ రిజల్ట్ ఏమవుతుందో? మొత్తానికి గ్రేటర్ ఎన్నికలు అన్ని పార్టీలకూ లిట్మస్ టెస్టులాగానే కనిపిస్తున్నాయి.