Advertisement

Advertisement


Home > Politics - Gossip

పునరావాసం ముసుగులో ఏం జరుగుతోంది?

పునరావాసం ముసుగులో ఏం జరుగుతోంది?

 రాజకీయ దాడులకు గురైన వారికి పునరావాసం కల్పిస్తానంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక గొప్ప మాట సెలవిచ్చారు.  ఈ పథకం కింద- రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో దాడులకు గురైన  లేదా దాడులకు భయపడి, స్వగ్రామాలను వదలి పారిపోయిన తెలుగు దేశం కార్యకర్తలకు  గుంటూరు లోనే పార్టీ ఆధ్వర్యంలో ఆశ్రయం కల్పిస్తారు.  పార్టీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా భీమా వంటి అనేక వినూత్న పథకాలు ప్రారంభించిన చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ,  ఈ రాజకీయ దాడుల బాధితులకు పునరావాసం ముసుగులో ఏం చేయబోతున్నది? అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది.

 గ్రామాలలో ప్రధాన పార్టీలకు చెందిన కార్యకర్తల  నడుమ, నిత్యం  తగాదాలు,  వైషమ్యాలు చెలరేగుతూనే ఉంటాయి.  అవి తరచూ పరస్పర దాడులకు దారి తీయడం కూడా జరుగుతుంది.  ఎన్నికలు ముగిసిన కొన్నాళ్ళ వరకూ,  ఇలాంటి తగాదాలు జరుగుతూనే ఉంటాయి.  గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా,  వారిపై దాడులు  జరిగాయి.  ఆ పార్టీ పాలన మీద కూడా విమర్శలు కురిశాయి. ఇదంతా సహజం.

 సాధారణంగా కార్యకర్తలు కొట్టుకోవడం,  దాడులు చేసుకోవడం వరకు వస్తున్నాయంటే..  అందులో పాల్గొనే ఉభయ పక్షాలలోనూ, రౌడీ తరహా మూకలు ఉండడం జరుగుతుంది.  ఏ పార్టీ కూడా ఇందుకు అతీతం కాదు.

 అయితే, ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే,  తెలుగుదేశం పార్టీ తరఫున మాచర్ల ప్రాంతంలో దాడులకు గురైన బాధితులు అందరినీ,  మూకుమ్మడిగా తీసుకువచ్చి,  గుంటూరులో వారికి పునరావాసం కల్పిస్తానంటూ చంద్రబాబు చెబుతున్నారు.  ఆ బాధితుల ముసుగులో,  ఎందరు అసాంఘిక శక్తులు ఉన్నారో,   ఎందరిపై రౌడీషీట్లు ఉన్నాయో..  ఎవరికీ తెలియదు.  అలాంటి వారి వలన రాజధాని ప్రాంతంలో.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను  చంద్రబాబు లక్ష్యిస్తున్నారో కూడా తెలియదు. ఇతర ప్రాంతాల్లో కేసుల్లో ఉన్నవారికి,  పునరావాసం పేరుతో ఒకవైపు  ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేస్తూ..  మరొకవైపు వారి ద్వారా కొత్త  అల్లర్లకు స్కెచ్ వేస్తున్నారేమో అనే అనుమానాలు పలువురిలో కలుగుతున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?