అందంగా వుండడం క్రైమ్ అంట

గ్యాంగ్ లీడర్ నాని కొటేషన్ ఇది. విక్రమ్ కే కుమార్ డైరక్షన్ లో హీరో నాని చేస్తున్న సినిమా గ్యాంగ్ లీడర్. ఈ సినిమా టీజర్, ట్రయిలర్ ల నుంచి పాటల విడుదల వరకు…

గ్యాంగ్ లీడర్ నాని కొటేషన్ ఇది. విక్రమ్ కే కుమార్ డైరక్షన్ లో హీరో నాని చేస్తున్న సినిమా గ్యాంగ్ లీడర్. ఈ సినిమా టీజర్, ట్రయిలర్ ల నుంచి పాటల విడుదల వరకు వచ్చింది. సిద్ శ్రీరామ్ పాడిన 'నిను చూసిన ఆనందంలో కనుపాపే కడలై పొంగిందే'…' అనే పాటను ఇప్పుడు విడుదల చేసారు. అనిరుధ్ స్వరపరిచిన ఈ పాట సిద్ శ్రీరామ్ పాటల స్టయిల్ లోనే వుంది. 

అనంత్ శ్రీరామ్ రాసిన ఈపాటకు ముందు నాని చేత కాస్త రసికత ఒలకబోసే ప్రయత్నం చేసాడు దర్శకుడు విక్రం కుమార్. అమ్మాయి ఎలా వుందీ అంటే ఒడుపుగా ముందు వెనుక చూసి, ఇంత అందంగా వుండడం క్రయిమ్ అంటూ ముక్తాయించి, పాట స్టార్ట్ చేసాడు హీరో.

మొత్తం మీద చూస్తుంటే సినిమా ఫన్, రొమాన్స్ రెండూ సమపాళ్లలో రంగరించే ప్రయత్నం చేస్తున్నట్లున్నాడు విక్రమ్ కుమార్. తీసిన జోనర్ లో సినిమా తీయకుండా వస్తూ, ఇప్పుడు రొమాంటిక్ కామెడీ జోనర్ లో ఫిక్స్ అయినట్లు మరోసారి అర్థం అవుతోంది ట్రయిలర్, సాంగ్స్ చూస్తుంటే.

https://www.youtube.com/watch?v=tmiYQE9Mvdk