ఉపదేశాలు చెబుతున్న బాబా చంద్రబాబు!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తారు? ఆయన బాబా అయిపోయారు. ఉపదేశాలు చెబుతున్నారు. నీతులు వల్లిస్తున్నారు. ‘జగన్ ప్రభుత్వం కూల్చడం మానేసి.. ఏదైనా కట్టిచూస్తే ఆ తృప్తి ఏంటో అర్థమవుతుందని’’ పర్సనాలిటీ…

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తారు? ఆయన బాబా అయిపోయారు. ఉపదేశాలు చెబుతున్నారు. నీతులు వల్లిస్తున్నారు. ‘జగన్ ప్రభుత్వం కూల్చడం మానేసి.. ఏదైనా కట్టిచూస్తే ఆ తృప్తి ఏంటో అర్థమవుతుందని’’ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు తీసుకుంటున్నారు. ‘తృప్తి అనగా ఏమిటి? అది ఏ విధముగా లభించును’’ అనే విషయం మీద క్లాసులు చెప్పడానికి తానే తగిన వ్యక్తిని అని చంద్రబాబునాయుడు నమ్ముతున్నట్లుగా ఉంది ఆయన వైఖరి. అందుకే.. ముఖ్యమంత్రి జగన్ ఎలా తృప్తిని పొందాలో నీతులు చెబుతున్నారు.

ఇతరులకు నీతులు చెప్పేముందు చంద్రబాబునాయుడు తన సంగతి కూడా చూసుకోవాలి. గురివిందనీతిని అనుసరించడం కాదు.. తనకు తెలిసిన సంగతులేమిటో.. తెలియని విషయాలేమిటో కూడా బేరీజు వేసుకోవాలి. ప్రజా సంక్షేమం అనే పదాలకు చంద్రబాబునాయుడుకు అర్థం తెలుసా?

తన జీవితంలో జనం మొహంలో ఎన్నడైనా చంద్రబాబునాయుడు చిరునవ్వులు పూయించారా? నవ్వును చూశారా? కేంద్రపథకాల్లో భాగంగా వచ్చే రోడ్లను తన ఘనతలాగా ప్రచారం చేసుకోవడం, తాను కట్టించినట్లుగా, తానే బిల్డర్ అవతారం ఎత్తినట్టుగా బిల్డప్ ఇచ్చుకోవడం తప్ప.. సంక్షేమం అంటే.. ప్రజల మొహంలో చిరునవ్వు చిందేలా చేయడం అనే నిర్వచనం అసలు చంద్రబాబుకు తెలుసా? అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. 

ఇవాళ..ఏపీలో ప్రతి కుటుంబం కూడా చిరునవ్వుతో, చింత లేకుండా బతుకుతున్నదంటే.. అందుకు కారణం జగన్మోహన్ రెడ్డి సర్కారు అనే భావన ప్రజల్లో ఉంది. అర్హత ఉన్న ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వం తరఫు నుంచి సంక్షేమ పథకాలు ఏదో ఒకరూపంలో అందుతున్నాయి. ప్రజలు వైసీపీ పాలనపట్ల ఎంతో సంతోషంగాను, తృప్తిగానూ ఉన్నారు. ముందు చంద్రబాబునాయుడు ఈ విషయం తెలుసుకోవాలి. 

ముఖ్యమంత్రి తృప్తిగా ఉండడం ఎలాగో.. జగన్ కు పాఠాలు చెప్పడం కాదు. అసలు ప్రజలు తృప్తిగా జీవించేలా చూసుకోవడం ఎలాగో.. జగన్ ను చూసి నేర్చుకోవాలి. నిజం చెప్పాలంటే.. చంద్రబాబునాయుడుకు అలాంటివి ఇష్టం ఉండవు. సమాజం పచ్చగా ఉంటే ఆయన తన కళ్లతో చూడలేరు.. అని ప్రజలు అనుకుంటున్నారు.

ప్రతి విషయాన్నీ రాజకీయం చేసి లబ్ధి పొందాలని అనుకోవడం వేరు. అలాంటి చెత్త మాటలు చంద్రబాబు ఎన్ని మాట్లాడుకున్నా పరవాలేదు. కానీ తృప్తి గురించి.. పాఠాలు చెప్పాలని పూనుకున్నప్పుడే ఇలా ప్రజలకు కడుపు మండుతుంది. 

చంద్రబాబు నాయుడు తన నీతిమాలిన ధోరణిని ఇప్పటికీ మార్చుకోవడం లేదు. చీకట్లో ఎవడో ఆకతాయి రాసి విసిరన దుర్ఘటనను.. పదేపదే హత్యాయత్నం రేంజిలో ప్రచారం చేసుకుంటున్నారు. అది స్వయంగా జగన్ చేయించినట్లుగా ఆయన ఇస్తున్న బిల్డప్ లు చూస్తోంటే.. ఇంత చీప్ గా ఆయన దిగజారిపోయాడా? అని ప్రజలు అనుకుంటున్నారు.