రౌడీస్…గెటౌట్… సిటీలో ఫస్ట్ టైం

రౌడీల ఆగడాలు శృతి మించిపోతున్న వేళ పోలీసులు కొరడా ఝలిపించారు. ఇంతకాలం పిలిచి కౌన్సిలింగ్ చేశారు. క్లాసులు పీకారు.  అయినా సరే తీరు మారని వారిని ఇక గెటౌట్ అంటూ స్ట్రాంగ్ యాక్షన కి…

రౌడీల ఆగడాలు శృతి మించిపోతున్న వేళ పోలీసులు కొరడా ఝలిపించారు. ఇంతకాలం పిలిచి కౌన్సిలింగ్ చేశారు. క్లాసులు పీకారు.  అయినా సరే తీరు మారని వారిని ఇక గెటౌట్ అంటూ స్ట్రాంగ్ యాక్షన కి దిగిపోయారు. విశాఖలో రౌడీ షీటర్ల ఆగడాలు ఇటీవల కాలంలో పెచ్చుమీరాయి.

దాంతో ఏ స్టేషన్ కి ఆ స్టేషన్ లో వారి చిట్టా తీసి పోలీసులు  క్లాసుల మీద క్లాసులు తీసుకున్నారు. ఈ దెబ్బకు కొందరు దారిలోకి వచ్చారు. ఇంకా మా దారి మాదే అంటూ మొరాయించిన నంబర్ వన్ రౌడీ షీటర్లను విశాఖ సిటీ బహిష్కరణ చేస్తూ నగర పోలీసులు  కఠిన చర్యలు చెపట్టారు.

ఆ విధంగా గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో పదికి పైగా క్రిమినల్ కేసులు ఉన్న నాగ శ్రీను అనే రౌడీ షీటర్ ని ఆరు నెలల పాటు విశాఖ నుంచి బహిష్కరిస్తూ నగరం పోలీసు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి ముందు రెండు రోజుల క్రితం విశాఖకు చెందిన పెంటకోట శ్రీను అనే రౌడీ షీటర్ ని కూడా విశాఖ నుంచి బహిష్కరించారు.

దీని మీద నగర పొలీస్ కమీషనర్ సీ హెచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ విశాఖలో రౌడీ షీటర్లకు చోటు లేదని స్పష్టం చేశారు. రౌడీయిజాన్ని గూండాయిజాన్ని ఉక్కు పాదంతో అణచివేస్తామని కూడా ఆయన హెచ్చరించారు. నేరాలకు పాల్పడుతూ విశాఖ ప్రశాంతతకు దెబ్బ తీస్తే చూస్తూ  ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. విశాఖలో రౌడీల ఆటకట్టించేందుకు చట్టపరంగా ఏం చేయాలో అన్నీ చేస్తామని సీపీ అంటున్నారు.