ప్రభాస్ ఆదిపురుష్ సినిమా 2023 సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. సమ్మర్ విడుదల అని వార్తలు వచ్చేసాయి. కానీ సమ్మర్ కు కూడా వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ సినిమా ను పూర్తిగా మార్చి, చక్కదిద్దకపోతే ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ కావడం కాకుండా మార్కెట్ దెబ్బతింటుంది అన్నది వాస్తవం. ఇప్పటికే సాహో, రాధేశ్యామ్ చాలా వరకు దెబ్బతీసాయి అన్నది వాస్తవం.
ఇలాంటి టైమ్ లో సలార్..ప్రాజెక్టు కే సినిమాలతో సమస్య లేదు. కానీ ఆదిపురుష్ తోనే సమస్య. అందుకే అన్ని విధాలా ఆ సినిమాను సెట్ చేసిన తరువాత కానీ విడుదల చేయవద్దని ప్రభాస్ ఫుల్ క్లారిటీతో ఇన్ స్ట్రక్షన్ ఇచ్చేసారని వార్తలు వినిపిస్తున్నాయ. అంతే కాదు అవసరం అయితే ఆదిపురుష్ ను వెనక్కు పెట్టి ముందుగా సలార్ ను విడుదల చేసినా ఆశ్చర్యం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.
నిజానికి ఇలా చేస్తే ఫ్యాన్స్ కు పండగే. సలార్ సినిమా వేరు..ఆదిపురుష్ వేరు. పైగా ఆదిపురుష్ గ్రాఫిక్స్, సిజి వర్క్స్ ఇప్పటికే ఫ్యాన్స్ ను డీలాకు గురిచేసాయి. పైగా ఇక్కడ మరో పాయింట్ కూడా వుంది. ఆదిపురుష్ విషయంలో నిర్మాతలకు హడావుడి ఏమీ లేదు. అన్ని విధాలా మార్కెట్ అయిపోయింది. అందువల్ల హర్రీ ఏమీ లేదు. ఫుల్ క్వాలిటీతో విడుదల చేయగలిగితే చాలు.
ఇవన్నీ లెక్కల్లోకి తీసుకుని ఆదిపురుష్ విడుదల మరికాస్త ఆలస్యం అనే వార్తలు వినిపిస్తున్నాయి.