మోడీని ఇరుకున పెట్టిన విజయసాయిరెడ్డి ?

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి విజయసాయిరెడ్డి ఒక అతి ముఖ్యమైన డిమాండ్ ని ముందు పెట్టి  కేంద్రంలోని మోడీ సర్కార్ ని ఇరుకున పెట్టేశారు. ఆయన వాణిజ్య పన్నుల శాఖ పార్లమెంటరీ కమిటీ…

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి విజయసాయిరెడ్డి ఒక అతి ముఖ్యమైన డిమాండ్ ని ముందు పెట్టి  కేంద్రంలోని మోడీ సర్కార్ ని ఇరుకున పెట్టేశారు. ఆయన వాణిజ్య పన్నుల శాఖ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఈ కమిటీ తన నివేదికను తాజాగా కేంద్రానికి సమర్పించింది.

ఈ నివేదికలో విజయసాయిరెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రతిపాదన పెట్టి మోడీ పరివారానికి భారీ షాక్ ఇచ్చేశారు అంటున్నారు. ఈ కమిటీ నివేదికలో ఇదే అంశం అతి ముఖ్యమైనదిగా ఉంది. అంతే కాదు ఏపీకి ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలో కూడా సహేతుకమైన కారణాలతోనే  విజయసాయిరెడ్డి వివరించారు.

రాజధానులు లేని రాష్ట్రంగా ఏపీ ఆవిర్భవించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. అందువల్ల బాగా అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా ప్రత్యేకా హోదా ఏపీకి వంటి రాష్ట్రానికి పదేళ్ల పాటు ఇచ్చి తీరాల్సిందే అంటూ ఆ నివేదికలో పొందుపరచడం విశేషం. అంతే కాదు, ఏపీలాగానే రాజధాని లేకుండా విడిపోయిన చత్తీస్ ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ చెప్పడం ద్వారా విజయసాయిరెడ్డి రాజనీతినే ప్రదర్శించారనుకోవాలి.

అదే విధంగా పేరుకు మాత్రమే రైల్వే జోన్ ఇచ్చినట్లుగా చెప్పుకుంటూ విశాఖను ఏమీ కాకుండా చేసిన కేంద్రానికి రైల్వే జోన్ ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కూడా అదే నివేదికలో కోరడం విశేషం. మొత్తానికి విజయసాయిరెడ్డి అతి ముఖ్య‌మైన పదవిలో తాను ఉన్నందుకు గానూ సొంత రాష్ట్రానికి గట్టి మేలు చేయాలన్న తన తలంపును చిత్త శుద్ధితో చాటుకున్నారని రాజకీయాలకు అతీతంగా ఆయనకు ప్రశంసలు దక్కుతున్నాయి. 

మరి పార్లమెంటరీ కమిటీ నివేదిక అంటే ఆషామాషీది కాదు, కేంద్రం దృష్టిలో నుంచి  కూడా దాటిపోలేనిది. మరి దీని మీద మోడీ సర్కార్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అన్నదే చూడాలి.