ఓ కొత్త హీరోను ఇంట్రడ్యూస్ చేయాలంటే అది ఓ కళ. అందరికీ రాదు. తెలుగులో ఇప్పటి వరకు బెల్లకొండ శ్రీనివాస్ అల్లుడుశ్రీను టైపు లాంచింగ్ ఎవ్వరికీ రాలేదు. బడా హీరోల వారసులకు కూడా. నిర్మాత, హీరో తండ్రి బెల్లంకొండ సురేష్ డేరింగ్ వ్యవహారం అది.
లేటెస్ట్ గా దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి లాంచింగ్ జరిగింది. సినిమా పూర్తయింది. ఫస్ట్ ఈవెంట్, హీరో పరిచయం విశాఖలో చేసారు.చేసారన్న సంగతి కూడా జనాలకు రీచ్ కాలేదు.
కొత్త హీరో తొలి పరిచయం విశాఖలో అదీ ఓ మారుమూల కాలేజీలో చేయాలన్న ఆలోచన ఎవరిదో కానీ వారికి హ్యాట్సాఫ్. మినిమమ్ రీచ్ కూడా రాలేదన్నది ఇండస్ట్రీ టాక్. దిల్ రాజు అనేక సినిమాలు సక్సెస్ ఫుల్ గా నిర్మించారు. ఎన్నో సినిమాలు విడుదల చేసారు. ఇది స్వంత హీరో ప్రెస్టీజియస్ ప్రాజెక్టు.
ఇప్పుడు కూడా తన దైన స్టయిల్ లో రొటీన్ గా వెళ్లకుండా కాస్త డిఫరెంట్ గా వెళ్లాలి.కొత్త ఆలోచనలు చేయాలి.కొత్తగా ఆలోచించాలి. హీరోకి సరైన లాంచింగ్ దొరక్కపోతే, ఓపెనింగ్ లోనో ఓ లెవెల్ హీరో అనే టాక్ తెచ్చుకోకపోతే ఇప్పుడున్న కాంపిటీషన్ లో కష్టం అవుతుంది.