నాగ్ చైతన్య కు కీలకమైన ప్రాజెక్టు లవ్ స్టోరీ. మొత్తానికి అనేకానేక అధికారిక, అనధికారిక డేట్ లు దాటి విడుదల డేట్ వచ్చేసింది. 24న విడుదల. ఇక పట్టుమని పది రోజులు లేదు.
సినిమాకు ఇప్పటికే చాలా క్రేజ్ వుంది. అందువల్ల ఓపెనింగ్స్ గురించి దిగులు పడక్కరేలేదు. కానీ అలా అని వదిలేస్తే కుదరదు. కొద్దిగా అయినా ప్రమోషన్స్ చేయాల్సిందే. అయితే మేకర్లు ఈ సినిమాకు ఎక్కువ ప్రమోషన్ చేయాలని అనుకోవడం లేదని బోగట్టా.
మరీ ఎక్కువ ప్రమోషన్ చేసి, అంచనాలు పెంచడం ఇష్టంలేదని భావిస్తున్నారని తెలుస్తోంది. కానీ నిర్మాతలకు తెలియాల్సింది ఏమిటంటే ఇప్పటికే అంచనాలు ఎక్కువే వున్నాయి. ఎందుకుంటే ఫిదా తరవాత శేఖర్ కమ్ముల సినిమా, అది కూడా సాయి పల్లవి కాంబినేషన్ లో. నాగ్ చైతన్య-సాయిపల్లవి ల కాంబినేషన్. అందువల్ల వుండాల్సిన అంచనా వుండనే వుంది. దాన్ని అందుకోవాల్సి వుంది.
ఇలాంటి టైమ్ లో చైతన్య ప్రమోషన్లకు వస్తారా? రారా? అన్న అనుమానాలు ఇండస్ట్రీలో వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల చైతన్య-సమంత జంట మీద అనేక గ్యాసిప్ లు చలామణీలోకి వచ్చాయి. అయితే వీటిని ఇటు సమంత కానీ, అటు చైతన్య కానీ ఖండించలేదు. అందువల్ల కచ్చితంగా మీడియా ఫోకస్ దీని మీద వుంటుంది. ఎంత కాదన్న ఎవరో ఒకరయినా క్వశ్చను వేయక తప్పదు.
సమాధానం చెప్పాలి. లేదా దాటవేయాలి. ఇవన్నీ ఫేస్ చేయడం అనవసరం అనుకుంటే చైతన్య మీడియా ముందుకు రారు. లేదూ ఎలా అయినా రెడీ అనుకుంటే వస్తారు? ఈవారంలో ఏ సంగతి తెలిసిపోతుంది.