వెంకీ కుడుముల మహేష్ టు నితిన్

భీష్మ సినిమా తరువాత వెంకీ కుడుమలకు మంచి పేరు వచ్చింది. ఛలో..భీష్మ బ్యాక్ టు బ్యాక్ రెండు సక్సెస్ లతో మంచి డైరక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తరువాత ఏంటీ దగ్గరే తికమక…

భీష్మ సినిమా తరువాత వెంకీ కుడుమలకు మంచి పేరు వచ్చింది. ఛలో..భీష్మ బ్యాక్ టు బ్యాక్ రెండు సక్సెస్ లతో మంచి డైరక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తరువాత ఏంటీ దగ్గరే తికమక స్టార్ట్ అయింది. మళ్లీ మరో మిడ్ రేంజ్ హీరోల వైపు వెళ్లి వుంటే ఈ పాటికి కనీసం రెండు సినిమాలు అతని నుంచి బయటకు వచ్చేవి. కానీ ఎందుకో పెద్ద పెద్ద హీరోల వైపు మళ్లాడు. మహేష్ తో సినిమా అని తెగ వార్తలు వినిపించాయి. కానీ ఎందుకో సెట్ కాలేదు.

ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి పేరు వినిపించింది. ఆల్ మోస్ట్ సినిమా కన్ ఫర్మ్ అని వార్తలు వచ్చాయి. తొలిసగం ఓకె అయింది. మలిసగం దగ్గర బ్రేక్ పడింది అనే వార్తలు కూడా వినిపించాయి. మెగాస్టార్ ఫన్ బాగా పండిస్తారు. వెంకీ కుడుముల ఫన్ రైటింగ్ చాలా బాగుంటుంది. సో ఇద్దరి కాంబినేషన్ క్లిక్ అవుతుందని మెగా ఫ్యాన్స్ అంతా అనుకున్నారు.

కానీ ఇప్పుడు మళ్లీ హీరో మారిపోయారు. వెంకీ కి బెస్ట్ ఫ్రెండ్ అయిన నితిన్ పేరు లైన్ లోకి వచ్చింది.నితిన్ తో వెంకీ కుడుమల సినిమా ఫిక్స్ అంటూ తెలుస్తోంది. అయితే నితిన్ ఇమ్మీడియట్ గా ఈ సినిమా చేస్తాడా? లైన్ లో వున్న ఒకటి రెండు పూర్తయిన తరువాత చేస్తాడా? అన్నది తెలియాలంటే ఒకటి రెండు రోజులు ఆగాలి. 

అవతల వక్కంతం వంశీ రకరకాల టీమ్ ల కాంబినేషన్ లతో స్టోరీ తో కుస్తీ పడుతున్నారు. ఇటీవల అయితే తన ఆఫీసులోనే కూర్చుని వక్కంతం ను కథ తయారు చేయమని నితిన్ ఆర్టర్ వేసాడనీ వార్తలు వచ్చాయి.

మైత్రీ మూవీస్ నిర్మించే వెంకీ కుడుముల సినిమా కచ్చితంగా బజ్ తెచ్చుకుంటుంది.