ఫుల్ సౌండ్ పార్టీ నైజాం రంగంలోకి

నైజాంలో డిస్ట్రిబ్యూషన్ రంగం మోనోపలీ అయిపోయింది. సునీల్, దిల్ రాజు చేతిలో థియేటర్లు వుండడంతో కొత్తగా ఎవరు పంపిణీదారు వచ్చినా నిలదొక్కుకోలేకపోతున్నారు. పైగా బలమైన సపోర్ట్ లేకుండా వుంది.  Advertisement ఇలాంటి నేపథ్యంలో మైత్రీ…

నైజాంలో డిస్ట్రిబ్యూషన్ రంగం మోనోపలీ అయిపోయింది. సునీల్, దిల్ రాజు చేతిలో థియేటర్లు వుండడంతో కొత్తగా ఎవరు పంపిణీదారు వచ్చినా నిలదొక్కుకోలేకపోతున్నారు. పైగా బలమైన సపోర్ట్ లేకుండా వుంది. 

ఇలాంటి నేపథ్యంలో మైత్రీ మూవీస్ లాంటి పెద్ద సంస్థ బ్యాకింగ్ తో సీడెడ్ కు చెందిన శశి రంగంలోకి దిగుతున్నారు. శశి ని అంత సులువుగా వరంగల్ శ్రీను మాదిరిగా నొక్కేసేంత సీన్ వుండదు. ఎందుకంటే ఇటు పొలిటికల్ గా, అటు ఫైనాన్షియల్ గా శశి బలమైన వ్యక్తి. పైగా కంటిన్యూగా సినిమాలు తీసే సంస్థ మైత్రీ.

ఇప్పటికే విశాఖ ప్రాంతంలో దిల్ రాజును చిరకాలంగా పక్కన పెట్టింది మైత్రీ సంస్థ. ఇప్పుడు నైజాంలో అదే జరగబోతోంది. అంటే కీలకమైన రెండు ఏరియాల్లో, కీలకమైన సంస్థ సినిమాలు దూరం అవుతున్నాయి. మైత్రీ మూవీస్ కు కూడా స్ట్రాంగ్ బ్యాక్ గ్రవుండ్ వుంది. పలు నిర్మాతలతో సన్నిహిత సంబంధాలు వున్నాయి.

ఇవన్నీ అలా వుంచితే సినిమా జనాలు చాలా మంది దిల్ రాజు ముందు స్నేహంగా, మంచిగా వుంటూనే వెనుకాల సరైన ఆల్టర్ నేటివ్ కోసం చూస్తున్నారు అన్నది వాస్తవం. ఇది కూడా ఒక పాయింట్. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ కూడా తన తరువాత నైజాం పంపిణీ కి దిల్ రాజు ను పక్కన పెడతున్నట్లు వార్తలు వున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఫుల్ సౌండ్ పార్టీ రంగంలోకి దిగడం అన్నది కచ్చితంగా టాలీవుడ్ కు శుభసూచకమే.