సుకుమార్ బాటలో మేర్లపాక

మేర్లపాక గాంధీ చేసినవి తక్కువ సినిమాలే కానీ కాస్త విషయం వుంది అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు పనిలో పనిగా తన అసిస్టెంట్ ను కూడా డైరక్టర్ గా మారుస్తున్నట్లు తెలుస్తోంది. తనే కథ,…

మేర్లపాక గాంధీ చేసినవి తక్కువ సినిమాలే కానీ కాస్త విషయం వుంది అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు పనిలో పనిగా తన అసిస్టెంట్ ను కూడా డైరక్టర్ గా మారుస్తున్నట్లు తెలుస్తోంది. తనే కథ, స్క్రీన్ ప్లే వగైరా వ్యవహారాలు అందిస్తూ, తన అసిస్టెంట్ ను యువి బ్యానర్ ద్వారా డైరక్టర్ ను చేయబోతున్నారు.

కరోనా టైమ్ లో కూడా నిత్యం యువిలో ఈ మేరకు డిస్కషన్లు నడుస్తున్నాయి. కాస్త సడలింపులు రాగానే రామోజీ ఫిలిం సిటీలోనే మొత్తం సినిమాను తీసేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాస్త డబుల్ మీనింగ్ లు, ఎరోటిక్ టచ్ వుంటుందని తెలుస్తోంది. ఈ చిన్న సినిమాను యువి బ్యానర్ పై కాకుండా, ఒక అనుబంధ  బ్యానర్ పెట్టి, దానిపై తీయాలనే ఆలోచనలు కూడా సాగుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సుకుమార్ లాంటి వాళ్లు కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ, క్వాలిటీ చెక్ చేస్తూ అసిస్టెంట్ లను దర్శకులను చేస్తున్నారు. ఇప్పుడు ఇదే బాటలో మేర్లపాక కూడా పయనిస్తున్నారు. ప్రస్తుతం మేర్లపాక గాంధీ తన తరువాత సినిమాను నితిన్ తో చేస్తున్నారు. అంథాదూన్ రీమేక్ అది. ఆ తరువాత మరో పెద్ద బ్యానర్ లో సినిమా చేస్తారని బోగట్టా. 

ఉషారాణికి అండగా మంత్రి అనిల్

కోహ్లీ.. గాలిలో చప్పట్లతో