స్టార్స్ ను ఆడించిన ఆ లెజెండ్ ఇకలేరు

బాలీవుడ్ లో మరో అధ్యాయం ముగిసింది. లెజెండ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూశారు. దాదాపు నెల రోజులుగా తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆమె ముంబయిలోని ఓ హాస్పిటల్ లో ఈరోజు తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్…

బాలీవుడ్ లో మరో అధ్యాయం ముగిసింది. లెజెండ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూశారు. దాదాపు నెల రోజులుగా తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆమె ముంబయిలోని ఓ హాస్పిటల్ లో ఈరోజు తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్ లో 4 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఆమెది.

బాలీవుడ్ కొరియోగ్రఫీని సరికొత్త మలుపు తిప్పిన వ్యక్తి సరోజ్ ఖాన్. ఆమె కంపోజ్ చేసిన ఎన్నో పాటలు సూపర్ డూపర్ హిట్టయ్యాయి. ఆమె డాన్స్ కు సామాన్య ప్రేక్షకులే కాదు, స్టార్స్ సైతం ఫ్యాన్స్ గా మారారు.

కెరీర్ లో 2వేలకు పైగా పాటలకు కొరియోగ్రఫీ అందించారు సరోజ్ ఖాన్. 3 సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. షారూక్ నటించిన దేవదాస్ లోని “డోలా రే డోలా” సాంగ్.. జబ్ వియ్ మెట్ లో “యే ఇష్క్ హే” అనే పాటకు.. శృంగారం అనే మరో సినిమాలో అన్ని పాటలకు గాను.. సరోజ్ ఖాన్ బెస్ట్ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు.

శ్రీదేవి నటించిన నాగిని, మిస్టర్ ఇండియా సినిమాలతో పాపులర్ అయ్యారు సరోజ్ ఖాన్. ఇక అప్పట్నుంచి ఆమెకు వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. కలంక్, గురు, స్వదేశ్, మంగళ్ పాండే, లగాన్, ఫిజా, తాళ్, హమ్ దిల్ దే చుకే సనమ్, పరదేశ్, ఖామోషీ, బేటా.. ఇలా ఎన్నో సినిమాలకు సూపర్ హిట్ డాన్స్ మూమెంట్స్ అందించారు సరోజ్ ఖాన్.

71 ఏళ్ల సరోజ్ ఖాన్ ఆరోగ్య కారణాల వల్ల సినిమాలు తగ్గించారు. తాజాగా ఆమె మణికర్నిక సినిమాకు వర్క్ చేశారు. ఆమె వర్క్ చేసిన చివరి పెద్ద సినిమా కలంక్. 

ఉషారాణికి అండగా మంత్రి అనిల్

అల్లు అర్జున్ మాయ చేసేస్తాడు