టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాటల్లో తప్ప, చేతల్లో ధైర్యం కనబరచరు. దమ్ముంటే తమ ముందుకు వచ్చి నిలబడు ప్యాలస్ పిల్లి… తేల్చుకుందామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సవాల్ విసిరారు. లోకేశ్ ట్వీట్‌పై నెటిజన్లు ఓ రేంజ్‌లో ర్యాగింగ్ చేస్తున్నారు. చంద్రబాబు పర్యటనలో ఎవరో ఆకతాయి రాయితో దాడి చేశారు. ఈ ఘటనలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధు గాయపడ్డారు.
ఈ నేపథ్యంలో లోకేశ్ ట్విటర్ వేదికగా తన మార్క్ రంకెలేశారు. ఆ ట్వీట్ ఏంటో చూద్దాం.
“ప్రతిపక్ష నేత చంద్రబాబు గారి కాన్వాయ్ పై వైసీపీ రౌడీ మూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. చీకట్లో రాళ్ళ దాడి చేసే దుస్థితికి దిగజారిపోయాడు ప్యాలస్ పిల్లి జగన్ రెడ్డి. చీకట్లో దొంగ దెబ్బ ఎందుకు, దమ్ముంటే మా ముందుకు వచ్చి నిలబడు #PalacePilli.. తేల్చుకుందాం”
ఈ ట్వీటే లోకేశ్‌ను నెటిజన్లు ఫుట్‌బాల్ ఆడుకోడానికి కారణమైంది. గతంలో టీడీపీ నేతలు ఎదురుగా వస్తే… పరారైన పిల్లి, ఇప్పుడు జగన్‌కు సవాల్ విసరడం కంటే విడ్డూరంగా వుంటుందా? అని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో పదో తరగతి విద్యార్థులతో లోకేశ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు.
జూమ్ మీటింగ్ లైవ్‌లోకి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వెళ్లారు. వాళ్లిద్దరినీ చూడగానే లోకేశ్‌కు ముచ్చెమటలు పట్టాయి. అతనికి నోట మాట రాలేదు. ఒక్కసారిగా షాక్‌కు గురైనంత పనైంది. దీంతో ఒక్కసారిగా జూమ్ మీటింగ్ లైవ్‌ను ఆపారు.
నాని, వల్లభనేని వంశీ కనిపిస్తేనే పరారైన లోకేశ్… జగన్‌కు సవాల్ విసరడం ఏంటని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. లోకేశ్ దమ్ము, ధైర్యం ఏంటో అప్పుడే తెలిసిపోయిందని, అలాంటిది తన ఎదురుగా రావాలని జగన్‌ను కోరడం ఏంటో అని వెటకరిస్తున్నారు. కనీసం మంగళగిరిలో కూడా గెలవలేని లోకేశ్‌కు జగన్‌ను సవాల్ చేసేంత సీన్ వుందా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
జగన్‌ను చూడాలనే కోరికను ఇలా వెల్లడించాడేమో అని మరికొందరు సెటైర్స్ విసురుతున్నారు. పులికి పిల్లి సవాల్ విసురుతోందని, అలాగే పిల్లికి, పులికి తేడా తెలుసుకుని ట్వీట్ చేస్తే బాగుండేదని మరికొందరు కామెంట్స్ చేయడం ఆసక్తి కలిగిస్తోంది.