కరోనా కు కాస్త అటు ఇటుగా విడుదలవుతున్న మలయాళ సినిమాలను తెలుగు నిర్మాతల దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి. అయ్యప్పన్ కోషియమ్ సినిమాను ఇప్పటికే సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ కొనుగోలు చేసి రవితేజ-రానా కాంబినేషన్ లో తెరకెక్కించేందుకు సన్నిహాలు చేసుకుంటోంది. డ్రయివింగ్ లైసెన్స్ సినిమా కూడా తెలుగులోకి వచ్చేదే కానీ, నిర్మాతలు కోట్ చేస్తున్న రేటు, చెబుతున్న రూల్స్ మామూలుగా లేవు.
ఇప్పుడు మరో సినిమా రైట్స్ ను తెలుగు నిర్మాతలు తీసుకుంటున్నారు. ఇటీవల విడుదలైన కప్పెల అనే చిన్న సినిమా కు మంచి అప్లాజ్ వచ్చింది. ఈ చిన్న సినిమాను దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా విపరీతంగా మెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా హక్కులను తెలుగు నిర్మాత ఒకరు తీసుకున్నారు.
నిజానికి ఈ సినిమా యాజ్ ఇట్ ఈజ్ గా తెలుగుకు అంతగా పనికిరాకపోవచ్చు. అయితే తగినన్ని మార్పులు, చేర్పులు చేయించడం ద్వారా తెలుగులో మంచి సినిమాగా చేయవచ్చేనే అయిడియాతో హక్కులు తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా టైమ్ లో చాలా మంది ఓటిటి ప్లాట్ ఫారమ్ ల మీద సినిమాలు చూసి కొనేందుకు ముందుకు వస్తున్నారు.