బన్నీకి ముగ్గురు బ్రదర్స్

బన్నీకి ముగ్గురు బ్రదర్స్ అని అంటే…అబ్బో భలే కనిపెట్టావ్ లే.. బన్నీ కాకుండా,  అల్లు బాబీ, అల్లు శిరీష్ అని పేర్లు కూడా తెలుసులే మాకు అంటారు ఫ్యాన్స్. కానీ విషయం అది కాదు.…

బన్నీకి ముగ్గురు బ్రదర్స్ అని అంటే…అబ్బో భలే కనిపెట్టావ్ లే.. బన్నీ కాకుండా,  అల్లు బాబీ, అల్లు శిరీష్ అని పేర్లు కూడా తెలుసులే మాకు అంటారు ఫ్యాన్స్. కానీ విషయం అది కాదు. బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమాలో బన్నీ వేస్తున్న హీరో పాత్రకు ముగ్గురు బ్రదర్స్ వుంటారు. అదీ విషయం.

ముగ్గురు అన్నదమ్మల ఫ్యామిలీలో బన్నీ పాత్ర హీరో అన్నమాట. మరో అన్నదమ్ముడి పాత్ర సర్పంచ్ అంట. అంటే రంగస్థలంలో మాదిరిగా చిన్న పొటిలికల్ టచ్ కూడా వుంటుందన్న మాట. 

చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సుకుమార్ రాసుకున్న కథతో సినిమా తయారవుతోంది. ముగ్గురు అన్నదమ్ముల పాత్రలకు చాలా ప్రాధాన్యత వుండడంతో, కాస్త గట్టి స్టార్ కాస్ట్ నే తీసుకుంటున్నారని బోగట్టా. రంగస్థలం సినిమాలో కూడా రామ్ చరణ్ సోదరుడిగా ఆదిపినిశెట్టిని తీసుకున్నారు. ఇప్పుడు కూడా దాదాపు కాస్త పేరున్న నటులనే తీసుకుంటారని తెలుస్తోంది.

కొత్త హీరోలని తొక్కేయ్యడం తప్పేమీకాదు

ఇకనుంచి డాక్టరే ప్రతి ఇంటికీ వస్తాడు