పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ ట్రయిలర్ వచ్చేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లొ ఓ పండగ మాదిరిగా థియేటర్లలో ట్రయిలర్ ను సాయంత్రం అయిదున్నరకే విడుదల చేసారు. ఆరుగంటలకు ఆన్ లైన్ లోకి వదిలారు. థియేటర్ల వద్ద భయంకరమైన కోలాహలం నెలకొంది.
ఇదిలా వుంటే ముందుగా గ్రేట్ ఆంధ్ర వెల్లడించినట్లుగానే ట్రయిలర్ లో హీరోయిజం తగ్గించారు. మూడు ఫైటింగ్ సీక్వెన్స్ లకు బదలు ఒకటే కట్ చేసారు. మిగిలినదంతా స్టోరీ మీదే వెళ్లారు. అలాగే ముందుగానే వెల్లడించినట్లు 'వర్జిన్' డైలాగు ట్రయిలర్ లోకి వచ్చింది.
అమ్మాయిని మీరు వర్జిన్ నా అని అడిగినపుడు అబ్బాయిని అడగకూడదా? అన్న యాంగిల్ లో డైలాగు పడింది. 'ఇదెక్కడి న్యాయం నందాజీ' అని పవన్ అనడం ఆయన స్టయిల్ ను గుర్తుకు తెచ్చింది. రాజకీయాల్లోకి వెళ్లాక పవన్ తరచు కేంద్ర రాజకీయ నాయకులను ఉద్దేశించినపుడల్లా ఈ 'జీ' అనే పదం వాడుతున్నారు. ట్రయిలర్ లో కూడా ప్రకాష్ రాజ్ కు నందా అనే పేరు పెట్టడం, బద్రీ సినిమాను గుర్తుకు తెచ్చింది.
పింక్ రీమేక్ ను సిన్సియర్ గా చేస్తున్నామన్న కలర్ ను ట్రయిలర్ తెచ్చింది. వాస్తవానికి సినిమాలో పింక్ పాయింట్ ను మాత్రం తీసుకుని, ఫ్యాన్స్ కు నచ్చినట్లు కమర్షియల్ చేసారు. అది ట్రయిలర్ లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.