సమంత ‘పుష్ప’ కు నో అనకుండా వుంటే..?

హీరోయిన్  సమంత కు మంచి చాన్స్ మిస్ అయింది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబో పుష్ప సినిమా ను ఆమె ఓ విధమైన డైలామాలో  వద్దనుకుంది. దాంతో ఇప్పుడు మంచి చాన్స్ మిస్ అయినట్లయింది. పుష్ప…

హీరోయిన్  సమంత కు మంచి చాన్స్ మిస్ అయింది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబో పుష్ప సినిమా ను ఆమె ఓ విధమైన డైలామాలో  వద్దనుకుంది. దాంతో ఇప్పుడు మంచి చాన్స్ మిస్ అయినట్లయింది. పుష్ప సినిమా ఆలోచన ప్రారంభంలోనే మైత్రీ మూవీస్ ఆ సినిమా కోసం సమంతను అప్రోచ్ అయ్యారు. కానీ గత ఏడాది చివర నుంచి ఈ ఏడాది ఆరంభం టైమ్ లో సమంత సినిమాలు చేయాలా? వద్దా అనే డైలామాలో వున్నారు.

ఆమె తన ఫ్యామిలీ లైఫ్, కెరీర్ ఈ రెండూ ఎలా డీల్ చేయాలి. కొన్నాళ్లు సినిమాలు ఆపాలా? ఇలా రకరకాల ఆలోచనల్లో వున్న టైమ్ లో అల్లు అర్జున్ సినిమా ఆఫర్ వచ్చింది. దాంతో ప్రస్తుతం సినిమాలు చేసే ఆలోచనలో లేనని కన్వే చేసినట్లు బోగట్టా. దాంతో వారు వేరే హీరోయిన్ ను ఎంచుకున్నారు. 

ఇప్పుడు మళ్లీ సమంత మనసు మారింది. సినిమాలు చేయాలనే డిసైడ్  అయ్యారు. ఎప్పుడో సోనీ సంస్థకు కమిట్ అయిన సినిమా, అలాగే తమిళ సినిమా చేతిలో వున్నాయి. కానీ సరైన తెలుగు ప్రాజెక్టు మాత్రం లేదు. అదే కనుక పుష్పకు అప్పట్లో ఎస్ అని వుంటే మాంచి క్రేజీ ప్రాజెక్ట్ ఒకటి వుండి వుండేది. రంగస్థలం తరువాత మళ్లీ సుకుమార్ డైరక్షన్ లో సినిమా అంటే ఆ బజ్..ఆ రేంజ్ వేరుక దా?

కొత్త హీరోలని తొక్కేయ్యడం తప్పేమీకాదు

ఇకనుంచి డాక్టరే ప్రతి ఇంటికీ వస్తాడు