లాక్‌డౌన్ కాలంలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటున్నారు. దేనిపైనైనా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతూ ఒక్కోసారి వివాదాస్పద హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటున్నారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న తలైవీ చిత్రంలో కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా జయలలిత సినిమాలో కంగనా కీ రోల్ పోషించడంపై తమిళ నటి మీరా మిథున్ ట్విటర్ వేదికగా ఘాటుగా స్పందించారు. ఈ మాటలు కంగనాను కంగారెత్తించేలా ఉన్నాయి. అసలు తలైవీ చిత్రంలో నటించే అర్హత కంగనా రనౌత్‌కి లేనే లేదు అంటూ తమిళ నటి తీవ్రస్థాయిలో ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.
బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య అనంతరం నెపోటిజంపై కంగనా ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. కొందరు బాలీవుడ్ పెద్దల వైఖరి వల్లే సుశాంత్ డిప్రెషన్‌కి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆమె విమర్శలు గుప్పించారు. తమిళ నటి మీరా మిథున్ తాను నెపోటిజం బాధితురాలినంటూనే కంగనాపై నిప్పులు చెరిగారు.
‘జయలలిత బయోపిక్‌లో నటించడానికి కంగనాకున్న అర్హత ఏంటి? ఏం చూసి ఆమెని ఎంపిక చేసుకున్నారు. కోలీవుడ్‌లో నడుస్తున్న రాజకీయాలే దీనికి ప్రధాన కారణం. నా రాష్ట్ర సీఎం పాత్రలో పోషించడానికి నువ్వు అనర్హురాలివి. షేమ్ ఫర్ మై లేట్ బిలవుడ్ సీఎం’ అంటూ కంగనాపై మీరా మిథున్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.