సైరా గురించి అవన్నీ పుకార్లే

సైరా అనుకున్న తేదీకి విడుదల కాదనే పుకార్లని సరాసరి బాలీవుడ్‌ ట్రేడ్‌ ఎనలిస్టులనే ప్రచారంలోకి తెచ్చారు. అక్టోబర్‌ 2న కాకుండా స్వల్ప వాయిదా పడి అక్టోబర్‌ 8న అంటే దసరా రోజున ఈ చిత్రం…

సైరా అనుకున్న తేదీకి విడుదల కాదనే పుకార్లని సరాసరి బాలీవుడ్‌ ట్రేడ్‌ ఎనలిస్టులనే ప్రచారంలోకి తెచ్చారు. అక్టోబర్‌ 2న కాకుండా స్వల్ప వాయిదా పడి అక్టోబర్‌ 8న అంటే దసరా రోజున ఈ చిత్రం రిలీజ్‌ అవుతుందని ప్రచారం చేస్తున్నారు. అయితే అక్టోబర్‌ 2 డేట్‌ని మిస్‌ చేసుకోవడానికి కొణిదెల ప్రొడక్షన్స్‌ బృందం సిద్ధంగా లేదు. అక్టోబర్‌ 2 నేషనల్‌ హాలిడేని క్యాష్‌ చేసుకోగలిగితే తొలి వారంలోనే వచ్చే దసరా హాలిడేని కూడా వాడుకోవచ్చు.

సైరా లాంటి భారీ బడ్జెట్‌ చిత్రానికి సమ్మర్‌ లాంటి సీజన్‌ కావాలి. కానీ అప్పటికి ఎలాగో సినిమా పూర్తి కాలేదు కనుక వున్న ఆప్షన్స్‌లో బెస్ట్‌ అయిన అక్టోబర్‌ 2ని టార్గెట్‌ చేసారు. ఈ డేట్‌కి రెడీ కావడం కష్టమనే భయం వున్నా కానీ రెండు షిఫ్టులు పని చేయిస్తూ అంతా ఒక కొలిక్కి తెచ్చారు. నార్త్‌లో పుట్టుకొచ్చిన ఈ పుకార్లని కొట్టి పారేసి అందులో నిజం లేదని పీఆర్‌ టీమ్‌ తేల్చేసారు.

సైరాని తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా విడుదల చేస్తున్నా కానీ ప్రధానంగా తెలుగు మార్కెట్‌నే టార్గెట్‌ చేస్తున్నారు. సరిగ్గా ప్లాన్‌ చేసుకుంటే తెలుగు మార్కెట్‌నుంచే నూట యాభై కోట్ల వరకు రాబట్టవచ్చు కనుక మిగతా భాషలని బఫర్‌ కోసం పెట్టుకున్నారు. ఇతర భాషల నుంచి ఎంత వచ్చినా బోనస్‌లానే భావిస్తూ చిరంజీవికి తెలుగునాట వున్న క్రేజ్‌నే పూర్తి స్థాయిలో వాడుకుంటున్నారు.

సినిమా రివ్యూ: సాహో