పాయల్ రాజ్పుట్ తొలిచిత్రం 'ఆర్ ఎక్స్ 100' ఎందుకంత హిట్ అయిందనేది అందరికీ తెలిసిన సంగతే. కేవలం సెక్స్, బోల్డ్ కంటెంట్ ప్రధానంగా ఒక వర్గాన్ని మాత్రం ఆకట్టుకున్న ఆ చిత్రంతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన పాయల్ రాజ్పుట్ ప్రస్తుతం వెంకటేష్‌తో 'వెంకీ మామ', రవితేజతో 'డిస్కో రాజా' చిత్రాలు చేస్తోంది. మామూలుగా అయితే ఇది చాలా పెద్ద అఛీవ్మెంట్ అనుకోవాలి.
కానీ పాయల్ రాజ్పుట్ ఈ చిత్రాలు తనచేతికి వచ్చేలోగా 'ఆర్ ఎక్స్ 100' కంటే దారుణమైన అడల్ట్ కంటెంట్ వున్న 'ఆర్డీఎక్స్ లవ్' అనే చిత్రంలో నటించింది. సెక్స్ ప్రధానంగా, విపరీతమైన బూతు కంటెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్స్ చూస్తే తెలుగు మెయిన్ స్ట్రీమ్ సినిమాలలో ఇంత దారుణమా అనిపించకమానదు.
సి.కళ్యాణ్ లాంటి ప్రముఖ నిర్మాత నుంచి ఇలాంటి సినిమా రావడం మీడియాని కూడా విస్మయపరచింది. ఇదిలావుంటే ఈ చిత్రంతో పాయల్‌కి వస్తోన్న ఫీడ్‌బ్యాక్ 'వెంకీమామ' బృందాన్ని ఇబ్బంది పెడుతోంది. ఈ చిత్రం తర్వాత ఆమెకి ఏ విధమైన ఇమేజ్ వస్తుందో, ఆమెతో వెంకటేష్ రొమాన్స్ చేస్తుంటే ఎలాగుంటుందో అనే ఆందోళన ఆ చిత్ర రూపకర్తలకి పరీక్షగా మారింది.