తన నుంచి విడిపోయిన జీవిత భాగస్వామికి టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్ విషెస్ చెప్పడం ఆకట్టుకుంటోంది. శిఖర్ ధావన్‌తో విడాకులు తీసుకున్నట్టు అయేషా ముఖర్జీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించడం క్రీడారంగంలో చర్చనీయాంశమైంది. తాజాగా విడాకులపై శిఖర్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు.
తన మాజీ భార్యనుద్దేశించి…. ‘ఏదైనా లక్ష్యాన్ని సాధించడానికి జీవితంపై అవగాహన, హృదయం అవసరం. దానిపై ప్రేమ ఉండాలి. అప్పుడే ఫలితాన్ని ఆస్వాదించొచ్చు. నీ కలలను సాకారం చేసుకోవడానికి కృషి చేయ్’ అని పోస్టు చేశాడు. ఈ పోస్టుపై పెద్ద ఎత్తున పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
శిఖర్ ధావన్ హృదయం ఎంతో మంచిదని.. దాన్ని ఈ పోస్టు ప్రతిబింబిస్తోందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. విడాకులపై అయేషా పోస్టు కూడా వైరల్ కావడం గురించి చర్చించుకున్నాం. ‘రెండో సారి విడాకులు తీసుకునే వరకు విడాకులు అనే పదం నాకు చెత్త పదంగా అనిపించేది ’ అని అయేషా పేర్కొన్నారు.
తొమ్మిదేళ్ల వివాహ బంధం విడాకులకు దారి తీసిన పరిస్థితులపై మాత్రం ఇద్దరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం విశేషం. సాధారణంగా సెలబ్రిటీలు విడిపోయే ముందు అందుకు కారణాలను వివరిస్తుంటారు. కానీ శిఖర్ ధావన్, అయేషా విడాకులకు సంబంధించి ఏమీ చెప్పకపోవడమే ట్విస్ట్. విడాకుల అనంతరం తమ ఫీలింగ్స్‌ని మాత్రమే తమకు తోచిన రీతిలో వెల్లడిస్తున్నారు.