పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ ఫిల్మ్ వకీల్ సాబ్ నిర్మాత ఎవరు అంటే దిల్ రాజు అని ఎవరైనా టక్కున చెప్పేస్తారు. కానీ ఆయనకూ నిర్మాణంలో వాటా వుందని తెలుస్తోంది. రెమ్యూనిరేషన్ విషయంలో కుదిరిన ఒప్పందం ప్రకారం పవన్ కు కూడా వకీల్ సాబ్ నిర్మాణంలో వాటా వుందని విశ్వసనీయ వర్గాల బోగట్టా.
ఈ సినిమాకు పవన్ రెమ్యూనిరేషన్ విషయంలో ఆది నుంచీ అనేక గ్యాసిప్ లు వినిపించాయి. పవన్ కాస్త గట్టిగానే పారితోషికం కోరుతున్నారని, దిల్ రాజు బేరాలు సాగించారని వార్తలు వినవచ్చాయి. ఆఖరికి ఈ డీల్ రెండు విధాలుగా సెట్ అయిందని తెలుస్తోంది.
ఒకటి. కొంత మొత్తం పారితోషికంగా ఫిక్స్ డా ఇవ్వడం. దాంతో పాటే నిర్మాణంలో భాగస్వామిని చేసి, లాభాల్లో వాటా ఇవ్వడం. అయితే ఎంత మొత్తం పారితోషికంగా ఇస్తున్నారు. ఎంత శాతం లాభాల్లో వాటా ఇస్తున్నారు అన్నది ఇంకా తెలియలేదు. కానీ ఈ రెండురకాల డీల్ కుదిరిన మాట మాత్రం వాస్తవం అని విశ్వసనీయ వర్గాల బోగట్టా.
ఇన్ టైమ్ లో వచ్చి వుంటే సినిమాకు మంచి మార్కెట్ వచ్చి వుండేది. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన పిక్స్ లో పవన్ లుక్ ఏమంత అట్రాక్టివ్ గా లేదు. పైగా సినిమాలు ఫైట్లు, ఫన్ లాంటి కమర్షియల్ టచ్ లు తక్కువ. కరోనా నేపథ్యంలో ఈసినిమా ఎప్పుడు విడుదలవుతుందో అన్నది క్లారిటీ లేదు. ఇంకా ముఫై నుంచి నలభై రోజుల వర్క్ బకాయి వుంది. అవన్నీ జరిగి, విడుదలకు రెడీ అయిన వేళ మార్కెట్ ను బట్టి లాభాలు ఏమేరకు వుండాయో చూడాలి.