మలయాళీ సినిమా లూసీఫర్ తెలుగు రీమేక్ విషయంలో వివిధ వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ సినిమాలో ఒక పాత్రకు సుహాసినిని తీసుకున్నారని ఒకసారి, కాదు ఆ పాత్రకు కుష్బూ అని మరోసారి కథనాలు వస్తున్నాయి. మలయాళీ వెర్షన్లో హీరోకి జోడీ ఎవరూ ఉండరు. అయితే హీరోకి సోదరి తరహా పాత్రలో మంజూ వారియర్ కనిపిస్తుంది. సినిమాలో అత్యంత ఆసక్తిదాయకమైన పాత్ర అది. హీరోని ద్వేషించే సోదరి పాత్రలో మంజూ నటన ఆకట్టుకుంటుంది.
మరి అలాంటి పాత్ర తెలుగు రీమేక్ లో సర్ ప్రైజింగ్ ఉంటే బాగుండేది. ఇప్పటికే తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బోలెడన్ని సినిమాల్లో కనిపించిన సుహాసిని అయినా, ఇప్పటికే చిరంజీవికి సోదరి పాత్రలో ఒకసారి నటించిన కుష్బూ అయినా.. బాగానే చేస్తారేమో కానీ, మళ్లీ పాత వాళ్లే అయితే సర్ ప్రైజింగ్ ఉండకపోవచ్చు!
తెలుగు వారికి కొత్తగా అనిపించే నటి ఎవరైనా అయితే ఆసక్తి పెరుగుతుంది. సుహాసిని, కుష్బూ అంటే మాత్రం కొత్త సీసాలోకి పాత సారా పోసినట్టుగా అవుతుందేమో! మలయాళీ వెర్షన్లో నటించిన మంజూ వారియర్ నే తెలుగులో నటింపజేసినా సమ్ థింగ్ స్పెషల్ అవుతుందేమో!