విశాఖలో ధూం ధాం గా సాయిరెడ్డి బర్త్ డే వేడుకలు

ఎక్కడ విశాఖ, ఎక్కడ నెల్లూరు, అయినా కానీ 2016లో విశాఖ వచ్చిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆ జిల్లా రాజకీయాలను ఒడిసిపట్టారు. వైసీపీని ఉత్తరాంధ్రాలో విజయపధంలో నడిపించారు. ఎంతో మంది శిష్యులను కూడా సంపాదించుకున్నారు.…

ఎక్కడ విశాఖ, ఎక్కడ నెల్లూరు, అయినా కానీ 2016లో విశాఖ వచ్చిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆ జిల్లా రాజకీయాలను ఒడిసిపట్టారు. వైసీపీని ఉత్తరాంధ్రాలో విజయపధంలో నడిపించారు. ఎంతో మంది శిష్యులను కూడా సంపాదించుకున్నారు.

నిజానికి జూలై 1న విజయసాయిరెడ్డి పుట్టిన రోజు వేడుకలు. అయితే విశాఖలో   ఒకరోజు ముందే మొదలైపోయాయి. విశాఖలో ఎక్కడ చూసిన హోర్డింగులు, ఫ్లెక్సీలు ధూం ధాం గా వెలిసాయి. ఇక అనకాపల్లి ఎమ్మెల్యే సాయిరెడ్డి ప్రియశిష్యుడిగా ఎదిగారు. ఆయన అనకాపల్లి అంతటా సాయిరెడ్డి హోర్డింగులతో నింపేశారు.

మరో వైపు సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు కూడా రెడ్డి గారి బర్త్ డే అంటూ హడావుడి చేస్తున్నారు. జగన్ తరువాత పార్టీలో నంబర్ టూగా ఉన్న‌ విజయసాయిరెడ్డి విశాఖలో తనదైన రాజకీయ నైపుణ్యంతో సొంత జిల్లాను చేసుకున్నారు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఏది ఏమైనా నెల్లూరు నుంచి వచ్చి విజయసాయిరెడ్డి విశాఖ రెడ్డిగా మారిపోయారు కదా. ఆయన పుట్టిన రోజు వేడుకలు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అంతా జరుపుకునేంతగా నాయకుడిగా నిలిచారు. మొత్తానికి విశాఖతో అనుబంధం పెనవేసుకున్న టీఎస్సార్ ని  సైతం నెట్టేసి క్షేత్ర స్థాయిలో గట్టి పట్టు సంపాదించారు. విశాఖలో వర్తమాన తరంలో విజయసాయి ధీటైన నేతగా రాణించడం అంటే మామూలు విషయం కాదేమో.

లాక్‌డౌన్ కట్టుబాట్లను దేశమంతా పాటించాలి: ప్రధాని మోదీ

మాస్క్ ధరించమన్న మహిళా ఉద్యోగిని చితక్కొట్టిన డిప్యూటీ మేనేజర్