Advertisement

Advertisement


Home > Politics - Gossip

భాజపా..అయ్యో...పవన్ ను వదిలేస్తారా?

భాజపా..అయ్యో...పవన్ ను వదిలేస్తారా?

ఎన్నికల్లో పరాభవం పాలై ఏడాది తిరగకుండానే భాజపాతో పొత్తు ప్రకటించి, తన దుకాణం అబేయన్స్  లో వుంచి తాను షూటింగ్ లకు వెళ్లిపోయారు జనసేనాధిపతి పవన్ కళ్యాణ్. మరో నాలుగేళ్ల తరువాత రాబోయే ఎన్నిక్లలో కాబోయే సిఎమ్ కేండిడేట్ ఆయనే అని ఆయన అభిమానులు బోలెడు భరోసాగా వున్నారు. భాజపా అండతో పవన్ సిఎమ్ కుర్చీలో కూర్చుంటారని బోలెడు ఆశలతో వున్నారు. పవన్ సోదరుడు నాగబాబు అయితే, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే వుండదని, భాజపా-జనసేన కూటమితో వైకాపా పోటీ పడుతుందని, పవన్ సిఎమ్ కావడం ఖాయమని చెబుతున్నారు. 

కానీ ఉన్నట్లుండి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో కొత్త గ్యాసిప్ చక్కర్లు కొడుతోంది. తమిళనాట పుట్టి, తెలుగింటిని మెట్టిన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ను ఆంధ్ర రాజకీయాల్లోకి భాజపా దింపుతుందన్నది ఆ గ్యాసిప్ సారాశం. అలాగే 2024 ఎన్నికల్లో సిఎమ్ అభ్యర్థిగా ఆమెను ముందుగానే ప్రకటిస్తారన్నది అదనపు సమాచారం.

ఇవి నిజమో, కాదో అన్న సంగతి అలా వుంచితే, భాజపా నిజంగానే ఇలా ఆలోచిస్తే, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటి? అన్నది. సిఎమ్ కేండిడేట్ కాకుండా ఆయన భాజపాలో ఎందుకు వుండడం? అలా బ్యాక్ సీట్ లో వుండే ఆలోచనే వుంటే తెలుగుదేశంతోనే  పొత్తు పెట్టుకోవచ్చు. కావాలంటే వైకాపాతోనూ పొత్తు పెట్టకోవచ్చు.కానీ ఆయనకు కావాల్సింది సిఎమ్ కుర్చీ. 

అది సోలోగా సాధ్యం కాదు. భాజపా అయితేనేం సిఎమ్ కేండిడేట్ గా పవన్ కు పెద్దగా పోటీ వుండదు. కానీ ఇప్పుడు ఈ ప్రచారం చూస్తుంటే ఆ కథ కాస్తా అడ్డం తిరగేలా వుంది. నిజంగా నిర్మలాసీతారామన్ ను రంగంలోకి దించితే పవన్ కు మరోసారి ఒంటరిపోరు తప్పదేమో?

మాస్క్ ధరించమన్న మహిళా ఉద్యోగిని చితక్కొట్టిన డిప్యూటీ మేనేజర్

లాక్‌డౌన్ కట్టుబాట్లను దేశమంతా పాటించాలి: ప్రధాని మోదీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?