నాగబాబు స్టార్ట్ చేసిన పనిని టిక్ టాక్ పూర్తిచేస్తుందా?

ఏళ్ల తరబడి ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా సాఫీగా సాగిపోయిన జబర్దస్త్ లో కలకలం రేగుతోంది. నాగబాబు బైటకెళ్లిపోయి, కొంతమందిని తనతో తీసుకెళ్లాలని విశ్వప్రయత్నాలు చేశారు. మంచి ప్యాకేజీలు కూడా ఆఫర్ చేశారు. కానీ ఒకరిద్దరు…

ఏళ్ల తరబడి ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా సాఫీగా సాగిపోయిన జబర్దస్త్ లో కలకలం రేగుతోంది. నాగబాబు బైటకెళ్లిపోయి, కొంతమందిని తనతో తీసుకెళ్లాలని విశ్వప్రయత్నాలు చేశారు. మంచి ప్యాకేజీలు కూడా ఆఫర్ చేశారు. కానీ ఒకరిద్దరు మినహా ఎవ్వరూ జబర్దస్త్ నుంచి కదల్లేదు. అయితే అప్పట్లో నాగబాబు చేయలేని పనిని ఇప్పుడు టిక్ టాక్ చేసేలా ఉంది. అవును.. జబర్దస్త్ టీమ్స్ మధ్య టిక్ టాక్ స్టార్స్ చిచ్చుపెట్టేలా ఉన్నారు.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. జబర్దస్త్ లోకి టిక్ టాక్ స్టార్స్ ని తీసుకురావాలని ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్లు ఆలోచిస్తున్నారట. ఇదే విషయాన్ని టీమ్ లీడర్స్ కి చెప్పి, ప్రతి టీమ్ లోనూ ఓ టిక్ టాక్ స్టార్ ఉండేలా చూడాలని ప్రయత్నించారట. అయితే టీమ్ లీడర్సంతా ఈ ప్రతిపాదనను నిర్ద్వందంగా తిరస్కరించారని తెలుస్తోంది. అలా చేస్తే.. తాము ప్రోగ్రామ్స్ చేయడానికి కూడా రాబోమని స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

అయితే ఇలాంటి విషయాల్లో మల్లెమాల అస్సలు వెనక్కుతగ్గే రకం కాదు. ఓ నిర్ణయం తీసుకుంటే అమలు చేయాల్సిందే. తను తప్పుకోవడానికి కూడా ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలే కారణమని స్వయంగా నాగబాబు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. సో.. జబర్దస్త్ లో మరోసారి అగ్గిరాజుకునే ప్రమాదం కనిపిస్తోంది.

జబర్దస్త్ నుంచి బైటకొచ్చేసిన నాగబాబు సరిగ్గా ఇలాంచి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నారు. కంటెస్టెంట్లను చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అదిరింది ప్రోగ్రామ్ ని కూడా పక్కనపెట్టి సొంత యూట్యూబ్ ఛానెల్ లో లేదా ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం కామెడీ షోలు చేయాలని చూస్తున్న నాగబాబు.. జబర్దస్ట్ నుంచి ఎంతమంది వస్తే అంతమందిని తీసుకోవాలని అనుకుంటున్నారు.

జబర్దస్త్ కి ఉన్న బలం కంటెస్టెంట్లే, వారంతా ఒకేసారి బైటకెళ్తే.. ప్రోగ్రామ్ సడన్ గా పడిపోతుంది. మొత్తమ్మీద జబర్దస్త్ లో మరోసారి ఏదో జరుగుతోంది. ఈటీవీకి పెద్ద ఎసెట్ గా మారిన ఈ కామెడీ ప్రోగ్రామ్.. ముందు ముందు ఇంకెన్ని సవాళ్లను ఎదుర్కుంటుందో చూడాలి. 

మన సినిమాలన్నీ ఫ్యాన్స్ కోసమే

చంద్రబాబు బాకీలు తీరుస్తున్న జగన్