నిర్మాత, మాజీ రాజకీయ నాయకుడు బండ్ల గణేష్ దేవుడికి కృతజ్ఞతలు చెప్పాడు. దీనికి ఓ ప్రత్యేక కారణం ఉంది. ఈమధ్య ఆయనకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి హోం క్వారంటైన్ లో ఉన్న బండ్ల గణేష్.. ఇప్పుడు ఆ మహమ్మారి వైరస్ నుంచి కోలుకున్నారు. తనకు పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందనే విషయాన్ని బండ్ల స్వయంగా ప్రకటించారు. అంతేకాదు.. నెగెటివ్ వచ్చిన కరోనా టెస్ట్ పేపర్ ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
బండ్ల గణేశ్ కు పాజిటివ్ వచ్చిందని తెలిసిన వెంటనే సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. ఎందుకంటే ఆ టైమ్ లో ఆయన కొంతమంది సినీప్రముఖుల్ని కలిశారు. మరికొన్ని బిజినెస్ మీటింగ్స్ లో కూడా పాల్గొన్నారు. అప్పట్లో ఆయన ఓ బ్యాంక్ కు కూడా వెళ్లొచ్చారు. అలాంటి వ్యక్తికి కరోనా రావడంతో అంతా అవాక్కయ్యారు.
బండ్ల గణేష్ కరోనా నుంచి కోలుకోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, సినీపరిశ్రమ ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం శుభాకాంక్షలతో బండ్ల గణేష్ సోషల్ మీడియా వాల్ నిండిపోయింది.
కరోనా నుంచి కోలుకున్న బండ్ల గణేశ్.. ప్రస్తుతం ఆ వైరస్ తో పోరాడుతున్న రోగుల కోసం ప్లాస్మా ఇవ్వడానికి ముందుకొచ్చారు. త్వరలోనే తను ప్లాస్మా ఇస్తానని, అలా మరొకరు కోలుకోవడానికి సహాయపడతానంటున్న బండ్ల.. అది తన బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు.
లాక్డౌన్ కట్టుబాట్లను దేశమంతా పాటించాలి: ప్రధాని మోదీ
మాస్క్ ధరించమన్న మహిళా ఉద్యోగిని చితక్కొట్టిన డిప్యూటీ మేనేజర్