నా అసలైన రీఎంట్రీ ఇది – కాజల్

పెళ్లి చేసుకొని, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చింది కాజల్ అగర్వాల్. ఆమె తిరిగి సినిమాల్లోకి వస్తుందంటే అవకాశాలిచ్చేవాళ్లు చాలామంది ఉన్నారు. కాబట్టి అలా వచ్చిన అవకాశాలతో ఆమె మళ్లీ సినిమాలతో బిజీ…

పెళ్లి చేసుకొని, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చింది కాజల్ అగర్వాల్. ఆమె తిరిగి సినిమాల్లోకి వస్తుందంటే అవకాశాలిచ్చేవాళ్లు చాలామంది ఉన్నారు. కాబట్టి అలా వచ్చిన అవకాశాలతో ఆమె మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయిందని అనుకున్నారు చాలామంది.

ఈ క్రమంలో భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య సరసన ఆమె హీరోయిన్ గా నటించింది. అయితే ఇందులో ఆమె పోషించిన కాత్యాయణి పాత్రకు ఏమంత పెద్ద రెస్పాన్స్ రాలేదు. కాజల్ రీఎంట్రీ బాగాలేదంటూ పెదవి విరిచారు చాలామంది.

అయితే తన అసలు రీఎంట్రీ అది కాదంటోంది కాజల్. పెళ్లి తర్వాత భారతీయుడు-2 సినిమాలో నటించడానికి అంగీకరించింది కాజల్. అదే టైమ్ లో సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమా చేయడానికి ఒప్పుకుంది. ఈ రెండు సినిమాలే తన అసలు సిసలైన రీఎంట్రీ మూవీస్ అని చెబుతోంది. దీనికి ఆమె కారణాన్ని కూడా వెల్లడించింది.

“రీఎంట్రీలో రొటీన్ సినిమాలు చేయాలనుకోలేదు. అందుకే ఈ రెండు సినిమాలు ఒప్పుకున్నాను. సత్యభామ కోసం మిక్స్డ్ మార్షన్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. ఇక భారతీయుడు-2 కోసం కలరి పయాట్టు అనే మరో యుద్ధ రీతిని నేర్చుకున్నాను. ఈ రెండు నేర్చుకోవడం కోసం దాదాపు 3 నెలలు టైమ్ కేటాయించాను. శారీరకంగా చాలా కష్టపడ్డాను.”

ఈ రెండు సినిమాలతోనే తను రీఎంట్రీ ఇస్తున్నట్టు తెలిపింది కాజల్. ఈ సినిమాల షూటింగ్స్ టైమ్ లో చాలా తృప్తి కలిగిందని, కెరీర్ లో తొలిసారి యాక్షన్ సన్నివేశాల్లో నటించానని తెలిపింది.